Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో సరికొత్త ప్రయోగం.. ఆవుపేడతో చేసిన బ్రీఫ్ కేసులో బడ్జెట్ పత్రాలు
By: Tupaki Desk | 10 March 2022 5:02 AM GMT‘ఆవు’కు హిందువులు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆవుతో రాజకీయాలు చేయటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ రాజకీయ విపక్షాలు విరుచుకుపడుతుంటాయి. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని.. కొందరు వాదించటం.. మరికొందరు విభేధించటం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి.
ఇలాంటి మాటలు చెప్పే వారికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం భారీ కౌంటర్ వేస్తుంటారు. ఆవు గురించి ఇన్ని చెబుతారు కదా.. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో చెప్పండని సూటిగా చెబుతుంటారు. ఇలాంటి ప్రశ్నకు చాలామంది కమలనాథులు మాట దాటేస్తారే తప్పించి.. సూటిగా మాత్రం సమాధానం చెప్పరు.
ఇదంతా ఎందుకంటే.. ఆవు చుట్టూ ఇంత రాజకీయం నడుస్తుందని చెప్పటానికే. ఇదిలా ఉంటే.. తాజాగా ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ అనూహ్యంగా వ్యవహరించారు. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టే వేళ.. ఆయన మరెవరూ చేయని వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు. రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆయన.. బడ్జెట్ పత్రాల్ని తనతో తీసుకొచ్చిన బ్రీఫ్ కేసు విషయంలో ఆయన చరిత్రను క్రియేట్ చేశారు. ఎందుకంటే.. ఆయన తీసుకొచ్చిన బడ్జెట్ పత్రాలున్న బ్రీఫ్ కేస్ ఆవుపేడతో చేసింది. ఈ బ్రీఫ్ కేస్ మీద ‘‘ధనలక్ష్మి ఆవుపేడలో నివసిస్తుంది’’ అన్న అర్థమొచ్చేలా సంస్క్రతంలో రాసి ఉండటం గమనార్హం.
సాధారణంగా బడ్జెట్ పత్రాల్ని తీసుకొచ్చేందుకు అయితే లెదర్ లేదంటే జూట్ తో చేసిన బ్రీఫ్ కేస్ లేదంటే.. సంచులతో తీసుకొస్తరు. అందుకు భిన్నంగా ఛత్తీస్ గఢ్ సీఎం మాత్రం ఆవుపేడతో ప్రత్యేకంగా తయారు చేయించిన బ్రీఫ్ కేస్ లో బడ్జెట్ పత్రాల్ని తీసుకొచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఆవుపేడ బ్రీఫ్ కేస్ లో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమంటే.. దీన్ని రాష్ట్రంలోని రాయ్ పూర్ గోకుల్ ధామ్ గౌతమ్ లో పని చేస్తున్న ఏక్ పహల్ అనే మహిళా స్వయం సహాయక టీం ఈ బ్రీఫ్ కేసును తయారు చేస్తుంది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఆవుతోనూ.. ఆవు బై ప్రొడక్టతో పలు కార్యక్రమాల్ని చత్తీస్ గఢ్ చేపడుతోంది. ఆవుపేడతో వర్మీకం పోస్టు.. ఆవు పేడతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులను వేస్తుండటం గమనార్హం.
ఆవుపేడ.. సున్నంపొడి.. మైదా.. చెక్కపొడి.. గారెల మిశ్రమాన్ని పొరల వారీగా రాసి 10 రోజులు కష్టపడి మరీ దీన్ని రూపొందించారు. ఇక బ్రీఫ్ కేసుకు పట్టుకోవటానికి అవసరమైన హ్యాండిల్ ను బస్తర్ ఆర్ట్ ఆర్టిసన్స్ గ్రూపు సభ్యులు తయారు చేశారు. ఇక.. ఆవుపేడతో తయారు చేసిన సూట్ కేసులో బడ్జెట్ పేపర్లను తీసుకురావటం ద్వారా.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లక్ష్మీ వస్తుందని.. రాష్ట్రంలో ప్రతి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేసిస్తుందన్న నమ్మకాన్నిచాటి చెప్పటం చూస్తే.. ఆవుతో ఈ తరహా రాజకీయం కూడా చేయొచ్చా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.