Begin typing your search above and press return to search.

కియో ఘ‌న‌త‌.. ఆయ‌న‌దే...

By:  Tupaki Desk   |   15 July 2019 7:15 AM GMT
కియో ఘ‌న‌త‌.. ఆయ‌న‌దే...
X
బీజేపీ, టీడీపీ నేత‌ల గొప్ప‌ల బాగోతం అసెంబ్లీ సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏపీకి కియో మోటార్స్ సంస్థ రావ‌డానికి అస‌లైన కార‌ణ‌మెవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది. ఈ ఘ‌న‌త ఎవ‌రిదో తెలిసిపోయింది. కియో ఘ‌న‌తంతా త‌మ‌దేన‌ని ఎవ‌రికివారుగా చెప్పిందే చెబుతూ.. ప‌దేప‌దే తిప్పేస్తూ వ‌స్తున్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, క‌మ‌ల‌నాథుల మాట‌లు ఉట్టివేన‌ని తెలిసిపోయింది. శాస‌న స‌భ‌లో ఆర్థిక మంత్రి బుగ్గ‌న బ‌య‌ట‌పెట్టిన ఆ సంస్థ లేఖ‌తో చంద్ర‌బాబు, క‌మ‌ల‌ద‌ళం గొప్ప‌ల బండారం బ‌ట్ట బ‌య‌లైంది. ఇక ఆల‌స్యం చేయ‌కుండా సూటిగా విష‌యంలో వ‌చ్చేద్దాం. అంత‌ర్జాతీయ కార్ల త‌యారీ సంస్థ కియో మోటార్స్ సంస్థ‌. ఈ సంస్థ విభాగాన్ని అనంత‌పురంలో ఏర్పాటు చేశారు.

మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు.. ఇక్క‌డి విభాగం నుంచి కారు త‌యారైందంటూ.. దానిని న‌డిపి ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు చేసిన హ‌డావుడిని ఎవ‌రూ మ‌రిచిపోలేరు. ఇక ప్ర‌తీ సంద‌ర్భంలో.. అది కార్య‌క్ర‌మం అయినా.. చంద్ర‌బాబు కియో ఘ‌న‌తంతా త‌న‌దేన‌ని చెప్పారు. అనేక క‌ష్టాలు ప‌డి.. ఆ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి.. క‌రువు సీమ‌కు కియో సంస్థ‌ను తీసుకొచ్చాన‌ని బాబుగారు సెల‌వివ్వ‌డం అంద‌రికీ తెలిసిందే. ఇక ఎప్పుడైతే.. ఎన్టీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారో.. అప్ప‌టి నుంచి క‌మ‌ల‌నాథులు కూడా కియో ముచ్చ‌ట అందుకున్నారు. ఏపీకి కియో సంస్థ రావ‌డానికి ప్ర‌ధాని మోడీయే కార‌ణ‌మ‌ని వారు గొప్ప‌లు దంచ‌డం మొద‌లు పెట్టారు. ఇందులో చంద్ర‌బాబు ఘ‌న‌త ఏమీ లేద‌ని.. అంతా మోడీదేన‌ని బీజేపీ నేత‌లు చెప్ప‌డం మొద‌లు పెట్టారు.

అయితే.. తాజాగా.. ఏపీకి కియో సంస్థ రావ‌డానికి ఇటు చంద్ర‌బాబుగానీ.. అటు ప్ర‌ధానిగానీ.. కార‌ణం కాద‌నీ.. ఈ ఘ‌న‌తంతా మ‌రొక‌రిద‌ని తెలిసిపోయింది. అది కూడా కియో సంస్థ ఘ‌న‌త త‌న‌దేన‌ని శాస‌న‌స‌భ‌లో మ‌రోసారి మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్ర‌స్తావించడంతో మంత్రి బుగ్గ‌న ఒక లేఖ బ‌య‌ట పెట్టారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌ కియో మోటార్స్ ఛైర్మ‌న్‌..సీఈవో రాసిన లేఖ‌ను బుగ్గ‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అందులో కియో సీఈవో దివంగ‌త సీఎం వైయ‌స్సార్ తో త‌మ‌కు ఉన్న సంబంధాల‌ను బ‌య‌ట పెట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 2007 లో భేటీ జ‌రిగింద‌ని గుర్తు చేశారు.

ఆ సందర్భంలో హ్యుండాయ్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయ‌టంతో పాటుగా ..అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రిస్తామ‌ని వైఎస్సార్‌ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా కియో సీఈవో తాము భార‌త్‌లో భ‌విష్య‌త్‌ లో ఏపీలో పెడుతామ‌ని తాను హామీ ఇచ్చాన‌ని కియో సీఈవో లేఖ‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే వైయ‌స్సార్‌కు ఇచ్చిన హామీ మేర‌కు కియో మొద‌టి ప్లాంట్‌ ను ఏపీలో ఏర్పాటు చేసామంటూ సంస్థ సీఈవో రాసిన లేఖ‌ను ఆర్దిక మంత్రి బుగ్గ‌న స‌భ‌లో చ‌దివి వినిపించ‌డంతో చంద్ర‌బాబు, క‌మ‌ల‌నాథుల గొప్ప‌ల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. పాపం బాబు.. ఎవ‌రో చేసిన ప‌ని ఘ‌న‌త‌ను కొట్టేయాల‌ని చూస్తే ఇలాగే ఉంటుంది మ‌రి.