Begin typing your search above and press return to search.

కియా నిజాన్ని మ‌రోసారి చెప్పిన బుగ్గ‌న‌!

By:  Tupaki Desk   |   16 July 2019 8:04 AM GMT
కియా నిజాన్ని మ‌రోసారి చెప్పిన బుగ్గ‌న‌!
X
నిజాన్ని దాచ‌లేం. ఏదో ఒక రోజున బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌దు. కియా మోటార్స్ కు సంబంధించిన వాస్త‌వం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్న కొద్దీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చంద్ర‌బాబు. ఏపీలోకియా మోటార్స్ ను నెల‌కొల్ప‌టానికి మొద‌ట సంప్ర‌దింపులు జ‌రిపింది దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అన్న నిజం తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. అయితే.. ఈ నిజాన్ని ఒప్పుకునేందుకు బాబు అండ్ కో ఏ మాత్రం సిద్ధంగా లేరు. ఆ మాట‌కు వ‌స్తే.. వైఎస్ హ‌యాంలోనే ఫోక్స్ వ్యాగ‌న్ కంపెనీని తీసుకొచ్చే ప్ర‌య‌త్నాన్ని మ‌ర్చిపోలేం.

కియో మోటార్స్ కు సంబంధించిన మైలేజీ మొత్తం బాబు ఖాతాలోనే ప‌డింది. ఇదిలా ఉంటే.. కియో మోటార్స్ ను ఏపీలో పెట్టేందుకు వైఎస్ చేసిన కృషిని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న ప్ర‌య‌త్నం చేయ‌టంతో బాబు ఇరిటేట్ అయ్యారు. అయితే.. తాను చెప్పిన నిజంపై బాబు స్పందించిన తీరును బుగ్గ‌న త‌ప్పు ప‌ట్టారు. ఇదిలా ఉంటే.. ఈ రోజుకూడా కియోకు సంబంధించిన అంశం బుగ్గ‌న వ‌ర్సెస్ బాబు మ‌ధ్య న‌డిచింది.

ఈ సంద‌ర్భంగా బుగ్గ‌న మాట్లాడుతూ.. కియా సీఈవో స్వ‌యంగా వైఎస్ కు లేఖ రాశార‌న్న స‌త్యాన్ని వెల్ల‌డించారు. అయితే.. ఈ మాట‌ల్ని చంద్ర‌బాబు కొట్టి పారేయ‌ట‌మే కాదు.. వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. బుగ్గ‌న రాజేంద్ర‌రెడ్డి చాలా తెలివైన వార‌ని.. ఆయ‌న తెలివితేట‌ల్ని తాను అభినందిస్తున్నాన‌న్న చంద్ర‌బాబు.. 2009లో వైఎస్ మ‌ర‌ణిస్తే.. ఆయ‌న ఆత్మ కియా సీఈవో వ‌ద్ద‌కు వెళ్లి.. 2016లో మీరు బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లండ‌ని చెప్పిందా? అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై బదులిచ్చిన బుగ్గ‌న‌.. బాబు పొగడ్త‌ను తాను స్వీక‌రిస్తున్న‌ట్లుగా చెప్పారు.తెలివి ఉన్నా లేకున్నా నిజం నిజ‌మే క‌దా?.. కియా సీఈవో 2019, జూన్ 13న రాసిన లేఖ‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. అందులో.. కియా సీఈవో పేర్కొన్న అంశాల్ని బుగ్గ‌న చ‌దివి వినిపించారు. తాము 2007లో వైఎస్ ను క‌లిశామ‌ని.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీలో ప్లాంట్ పెట్టాల‌ని రిక్వెస్ట్ చేశారంటూ లేఖ వివ‌రాల్ని వెల్ల‌డించారు. బాబు వ్యంగ్యంగా మాట్లాడినా నిజం నిజ‌మే క‌దా? అన్న బుగ్గ‌న మాట‌ల‌తో బాబుకు సౌండ్ లేని పరిస్థితి.