Begin typing your search above and press return to search.
టీడీపీ బుగ్గన పిట్టకథ అదిరింది
By: Tupaki Desk | 15 Jun 2018 10:40 AM GMT‘ఒక అడవిలో ఒక కుందేలు నిద్రపోతుండగా దాని మీద ఒక కొబ్బరికాయ పడుతుంది. ఉలిక్కి పడి లేచిన కుందేలు.. ఆకాశం విరిగిపడుతోందని పరిగెత్తుతుంది. దానికి మరో జంతువేదో ఎదురొస్తే ఆకాశం విరిగిపడుతోంది పరిగెత్తు అని చెప్పి భయపెడుతుంది. ఇలా అడవిలోని జంతువులన్నింటినీ ఆ కుందేలు హడలుగొడుతుంది..ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తీరు కూడా ఇలానే ఉందని’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
స్పీకర్ టీడీపీ పీఏసీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక అలాంటప్పుడు తాను ఢిల్లీ పెద్దలకు ఇవ్వడానికి మీకు తెలియని కీలక పత్రాలు ఏముంటాయి ? అని బుగ్గన ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్‌గా తను కీలక పత్రాలను బీజేపీ పెద్దలకు అందజేశానని మంత్రి యనమల అంటారు. ఇక మరో మంత్రి నారా లోకేష్ ఎంత సేపూ ఢిల్లీలో ఎవరు ఎవరిని కలిశారు ? ఎక్కడ భోంచేశారు ? అని ఆరాలు తీస్తుంటారు. పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖ చేతిలో ఉన్న లోకేష్ దానికి న్యాయం చేసేందుకు ఆలోచిస్తే బావుంటుందని సూచించారు.
ఢిల్లీలో తాను బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలిసింది నిజమేనని, ఇద్దరం కలిసి భోంచేశామని, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కూడా కలిసి హత్తుకున్నారని, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందని బుగ్గన ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత బీజేపీ అంటేనే ఉలిక్కిపడుతుంది.
ఢిల్లీలో ఎవరు సమావేశం అయినా టీడీపీ నేతలు ఆందోళనగా మీడియా ముందుకు వచ్చి ఏదో జరిగిపోతుందని ఏం జరిగినా కేంద్రానిదే భాధ్యత అని భయంభయంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అసలు చంద్రబాబు ఇంత భయపడడానికి కారణం ఏంటి ? బీజేపీ వద్ద అసలు బాబుకు సంబంధించి ఏ పత్రాలు ఉన్నాయి ? అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారట.