Begin typing your search above and press return to search.

ఐదేళ్ల‌లో బాబు అప్పు లెక్క తేలింది!

By:  Tupaki Desk   |   12 July 2019 9:39 AM GMT
ఐదేళ్ల‌లో బాబు అప్పు లెక్క తేలింది!
X
మీరు చాలా మంచోళ్లు. ఎలాంటి చెడ్డ అల‌వాట్లు లేవు. ప‌ని.. ఇల్లు త‌ప్పించి ఇంకేం ఉండ‌దు. అలాంటి మీరు ప‌దిల‌క్ష‌లు అప్పు చేశార‌నుకుందాం. ఆ అప్పు ఎందుకు చేస్తార‌ని అడిగితే.. అయితే.. ఆరోగ్య స‌మ‌స్య‌లు.. లేదంటే ఏదైనా కొత్త వ్యాపారం చేయ‌టానికి.. పెట్టుబ‌డి పెట్ట‌టానికి.. లేదంటే ఇంట్లో వ‌స్తువుల కోసం లాంటి లెక్క ఏదో ఒక‌టి చెబుతారు క‌దా? మీరు చేసిన రూ.10 ల‌క్ష‌ల‌కు లెక్క క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటుంది క‌దా?

అదే రీతిలో ఒక రాష్ట్రం ల‌క్ష కోట్లు అప్పు చేస్తే.. దానికి సంబంధించిన అభివృద్ధి అంతో ఇంతో క‌నిపించాలి క‌దా? మ‌రి.. ఏపీకి సంబంధించి మీకేమైనా అభివృద్ధి క‌నిపించిందా? కానీ.. ఐదేళ్లు పాలించమ‌ని అవ‌కాశం ఇచ్చిన దానికి ప్ర‌తిఫ‌లంగా బాబు స‌ర్కారు ఎంత అప్పు చేశార‌న్న లెక్క తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదెలానంటే..

ఏపీని అంత అభివృద్ధి చేశాం.. ఇంత చేశామంటూ బ‌డాయి క‌బుర్లు చెప్పిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ ఎంత‌లా అప్పుల కుప్ప‌గా మారింద‌న్న విష‌యం ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట‌కు వ‌స్తోంది.అన‌ధికారిక లెక్క‌ల సంగ‌తి ఎలా ఉన్నా. .తాజాగా ఈ విష‌యం మీద ఒక క్లారిటీ వ‌చ్చింది. విభ‌జ‌న వేళ‌లో ఏపీకి ఎంత అప్పు వ‌చ్చింది? గ‌డిచిన ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు స‌ర్కారు ఎంత అప్పు చేసి వెళ్లింది? తాజాగా ఎంత అప్పు ఉంది? అన్న లెక్క‌ల్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది.

ఏపీ రాష్ట్ర ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి లెక్క‌ల ప్ర‌కారం త‌న ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు భారీగా అప్పు చేసిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మ హ‌యాంలో చంద్ర‌బాబు చేసిన అప్పు ఏకంగా రూ.ల‌క్ష కోట్ల‌కు పైనే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆర‌వైఏళ్ల ఉమ్మ‌డి రాష్ట్రంలో చేసిన అప్పు కంటే.. ఐదేళ్ల‌లో బాబు చేసిన అప్పు ఎక్కువ‌గా ఉండ‌టం చూస్తే ప‌లు అనుమానాలు క‌ల‌గ‌టం ఖాయం.

ఎందుకంటే.. ల‌క్ష కోట్ల అప్పుకు త‌గ్గ‌ట్లు ఏపీలో అభివృద్ధి క‌నిపించ‌క‌పోవ‌ట‌మే దీనికి కార‌ణం. అప్పు లెక్క‌ల్లోకి కాస్త లోతుగా వెళితే.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ వాటా కింద వ‌చ్చిన అప్పు రూ.1,30,654.34 కోట్లుగా తేల్చారు. ఇక‌.. ఐదేళ్ల బాబు పాల‌న‌లో ఏపీ చేసిన అప్పు ఏకంగా రూ.1,00,658.37 కోట్లు. ఇక‌..ఏపీ రాష్ట్రం నెత్తిన ఉన్న మొత్తం అప్పు లెక్క చూస్తే.. రూ.2,61,302.81 కోట్లుగా లెక్క తేల్చారు. ఇంత భారీ అప్పుకు కార‌ణం ఏమిటి? వేటి కోసం ఇంత భారీగా అప్పు చేశార‌న్న లెక్క‌లోకి జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాస్త దృష్టి పెడితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.