Begin typing your search above and press return to search.

బుగ్గన సవాల్ విసిరారు.. కన్నా కామ్ గా ఉండటం ఏమిటి?

By:  Tupaki Desk   |   3 May 2020 1:30 AM GMT
బుగ్గన సవాల్ విసిరారు.. కన్నా కామ్ గా ఉండటం ఏమిటి?
X
రాజకీయాల్లో ఆరోపణలు చాలా మామూలుగా మారాయి. బండలేసే వారు వాస్తవాల్ని చెప్పే కంటే కూడా ప్రత్యర్థుల్ని ఎంత బాగా ఆత్మరక్షణలో పడేశామన్న దానికే ప్రాధాన్యత ఇస్తున్న వైనం ఇటీవల కాలంలో ఎక్కువ అవుతోంది. నిజాల కంటే కూడా లాజిక్ కు సరిపోయేలా ఉండే అబద్దాన్ని చెప్పేస్తున్నారు. ఇలాంటికోవకు చెందినదే.. ఏపీ బీజేపీ రథసారధి కన్నావారి ఆరోపణలు. ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తున్నారు కన్నా.

అందులో భాగంగానే ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి బుగ్గన మీద ఆయన భారీ ఆరోపణలే చేశారు. కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున తెప్పించటం.. వాటి నాణ్యత మీద రచ్చ సాగటం తెలిసిందే. ఇలాంటివేళే.. కరోనా కిట్లను తెప్పించిన కంపెనీలో బుగ్గన డైరెక్టర్ గా ఉన్నట్లుగా ఆరోపించారు. ఈ మాట షాకింగ్ గా మారింది. తన మీద బండేసిన కన్నాకు భారీ సవాలు విసిరారు బుగ్గన.

కిట్లను సరఫరా చేసిన కంపెనీలో తాను డైరెక్టర్ గా ఉన్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిరూపిస్తారా? అన్న ఆయన.. అలా నిరూపించిన పక్షంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రాజీనామా చేస్తానని భారీ ఛాలెంజ్ విసిరారు. బుగ్గన నోటి నుంచి అంతటి సీరియస్ వ్యాఖ్య వస్తే.. కన్నా మాత్రం మౌనంగా ఉండిపోవటం గమనార్హం. రాజకీయాల్లో ఆరోపణలు సరే. కానీ.. పస లేని ఆరోపణలు చేసి అడ్డంగా బుక్ అయ్యే కన్నా.. కామ్ గా ఉండం మేలన్న విషయాన్ని కన్నా లాంటి సీనియర్ నేత ఎప్పటికి గుర్తిస్తారో?