Begin typing your search above and press return to search.

టీడీపీ-జ‌న‌సేన‌కి.. ఎన్ని పెళ్లిళ్లో ఎన్ని విడాకులో.. ఏపీ మంత్రి హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   21 Oct 2022 3:40 PM GMT
టీడీపీ-జ‌న‌సేన‌కి.. ఎన్ని పెళ్లిళ్లో ఎన్ని విడాకులో.. ఏపీ మంత్రి హాట్ కామెంట్స్‌
X
ఏపీ వైసీపీ మంత్రులు త‌మ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌ట్లోఫుల్ స్టాప్ పెట్టే ప‌రిస్థితిలో వారు క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి అధికారంలో ఉన్న పార్టీ.. ఏదైనా వివాదం త‌లెత్తిన‌ప్పుడు.. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఫుల్ స్టాప్ పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.

అయితే.. దీనికి భిన్నంగా వివాదానికి.. మ‌రింత ఆజ్యం పోస్తూ.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డంలో ఏపీ మంత్రులు నిష్టాణుతులు అనే మాట‌ల‌ను వారు నిరూపించుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల్లో మ‌రిన్ని మంట‌లు రేపుతున్నాయి.

''వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2014 నుంచీ అసెంబ్లీలో టీడీపీ నాయకులు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీడీపీ, జనసేన మధ్య ఎన్ని సార్లు పెళ్లిళ్లు, విడాకులు అయ్యాయో..!'' అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్‌ హాల్లో గురువారం నిర్వహించిన ట్రేడ్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడారు.

''రాజకీయాల్లో ఓపిక ఉండాలి. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు సరికాదు. మూడు రాజధానులతోనే మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యం. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని మంత్రులుగా చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను ఏనాడూ దాచలేదు. అవసరమైతే కాగ్‌, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చు'' అని బుగ్గన తెలిపారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ''పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నేతగా అనర్హుడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించే వ్యక్తి, ఏ మొహం పెట్టుకొని మహిళలను ఓట్లు అడుగుతారు. ఎన్టీఆర్‌ వద్ద సైకిల్‌ గుర్తు లాగేసుకున్నారని చెప్పిన పవన్‌... అలాంటి వ్యక్తితో ఎలా జత కలిశారు? చంద్రబాబు చరిత్రహీనుడు. పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు'' అని నారాయణస్వామి అన్నారు.

ఇక‌, దీనికి జ‌న‌సేన నేత‌లు ఎలానూ కౌంట‌ర్ ఇస్తారు. సో.. ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. అదికార పార్టీ ఈ వివాదానికి ముగింపు ప‌ల‌కాల‌ని.. విజ్ఞులు కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.