Begin typing your search above and press return to search.

బాబును ఆయన ఏ రేంజిలో ఏకిపడేశారంటే..

By:  Tupaki Desk   |   13 Oct 2016 11:28 AM GMT
బాబును ఆయన ఏ రేంజిలో ఏకిపడేశారంటే..
X
ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏకిపారేశారు. చంద్రబాబు వింతగా మాట్లాడుతున్నారంటూ ఆయన ఆశ్చర్యపోయారు. ఎవరి కడుపున పుట్టాలి... ఏ ప్రాంతంలో పుట్టాలన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదని.. అయినా - జన్మభూమిని - కన్నతల్లిని వద్దనుకునేవారు ఎక్కడా ఉండరని చెప్పిన ఆయన చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుట్టి ఉంటే బాగుండేదని చెప్పడంపై మండిపడ్డారు. ఎవరైనా పుట్టిన గడ్డపైనే పదేపదే పుట్టాలని కోరుకుంటారని… ఎన్ని జన్మలైనా ఇప్పటి తల్లికడుపునే పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు మాత్రం అమెరికాలో పుడుతానంటున్నారని విమర్శించారు.

అలాగే వెయ్యి నోట్లు రద్దు చేయాలని కోరుతున్న చంద్రబాబు తాను రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీల ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. జీఎస్‌ డీ - జీడీపీ అంటూ జనాలకు అర్థం కాని సంగతులన్నీ చెబుతూ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్న భావనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పుష్కర ఘాట్ల దగ్గరకు వెళ్లి జీడీపీ గురించి మాట్లాడిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇమేజ్ బిల్డింగ్‌ పై దృష్టి పెట్టారే కానీ ఏపీ కేపిటల్ బిల్డింగుపై దృష్టిపెట్టలేదని వ్యాఖ్యానించారు. చేయాల్సిన పనులు చేయకుండా దోమలపై దండయాత్ర - ఈగలపై యుద్ధం అంటూ ముఖ్యమంత్రి పదవికే చంద్రబాబు చెడ్డపేరు తెస్తున్నారని బుగ్గన విమర్శించారు. హైదరాబాద్‌ ను కట్టింది తానే - ఐటీని కనిపెట్టింది తానే - డ్వాక్రా సంఘాల సృష్టికర్తను తానే - సింధూకు ఆటను నేర్పింది తానేనని చెప్పుకొంటూ ఆయనలో ఆయన ఆనందపడుతున్నారని గాలి తీసేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/