Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ఆ పిచ్చి ఉందట
By: Tupaki Desk | 19 Oct 2016 10:54 AM GMTఏపీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ - వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు... చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుందని కూడా ఆయన విమర్శించారు. అమెరికా - ఇతర దేశాల పిచ్చి ఆయనకు పట్టుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు. రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని సింగపూర్ వాళ్లతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని.. చరిత్రలో ఇంత పెద్ద కుంభకోణం ఇంకేదీ లేదని బుగ్గన విమర్శించారు. రైతుల భూమి తీసుకుని 12 నుంచి 15వేల కోట్లు ఖర్చుపెట్టి సింగపూర్ కు అతి చౌకగా భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు.
రాజధాని భూముల విషయంలో చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మరని.. కేవలం రూ.300 కోట‍్లు ఖర్చుపెట్టే సింగపూర్ కు 58శాతం వాటా ఇచ్చి, రూ.15 వేలకోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం 48 శాతం వాటా తీసుకుంటుందనటం నవ్వు తెప్పిస్తోందని బుగ్గన వ్యాఖ్యానించారు. ఎలాంటి బాధ్యత లేని సింగపూర్ కు వేలకోట్ల లబ్ది చేకూర్చుతారా అని ఆయన ప్రశ్నించారు. భారతీయ కంపెనీలను చంద్రబాబు తీవ్రంగా అవమానిస్తున్నారని - మనవాళ్లు గాడిదలు - విదేశీయులు గుర్రాలా అని ప్రశ్నించారు. భారతీయులన్నా - భారతీయ కంపెనీలన్నా చంద్రబాబుకు చులకన భావం ఉందని ఆయన అన్నారు.
కోర్టులు తప్పు పట్టినా కూడా చంద్రబాబు ఏమాత్రం మారడం లేదని... స్విస్ చాలెంజ్ విధానాన్ని హైకోర్టు తప్పుబట్టిందని - కోర్టులు తప్పుబట్టాయనే కారణంగానే ఏకంగా చట్టాన్ని సవరించేందుకు తెగబడుతున్నారని బుగ్గన ఆరోపించారు. స్విస్ చాలెంజ్ నిబంధనల్లో ఎక్కడా పారదర్శకత లేదన్నారు. అమరావతిని సింగపూర్ కంపెనీలకు తాకట్టుబెట్టడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/