Begin typing your search above and press return to search.
కియా తరలింపు ప్రచారం: మంత్రి బుగ్గన క్లారిటీ
By: Tupaki Desk | 6 Feb 2020 11:08 AM GMTపచ్చ మీడియా పిచ్చి రాతలు ఏపీని అల్లకల్లోలం చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు తరచూ ఆరోపిస్తుంటారు.. అమరావతి పేరిట చంద్రబాబు,అండ్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. అమరావతిలో భూగోళం బద్దలైన్నట్టు బయటి ప్రపంచానికి చూపించారు. అంత లేకున్నా చిలువలు పలువులు చేసి వైసీపీ సర్కారును అభాసుపాలు చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దగ్గరన్న బలమైన మీడియా కుందేలుకు మూడు కాళ్లని కూడా నమ్మించగల సామర్థ్యం గలదని విమర్శిస్తుంటారు. అయితే ఎవరున్నారో ఏం జరిగిందో తెలియదు కానీ మళ్లీ ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్ర జరిగిందన్న అనుమానం వైసీసీ వర్గాల్లో వ్యక్తమైంది.
తాజాగా కియా మోటార్స్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారంటూ ప్రసిద్ధ వార్త సంస్థ రాయిటర్స్ ఓ కథనాన్ని వండివార్చింది. దీంతో ఇదో అద్భుత అవకాశాన్ని టీడీపీ నేతలు పండుగ చేసుకున్నారు. దీనిపై వైసీపీ సర్కారు అధికారికంగా స్పందించింది.
కియా ప్లాంట్ ఎక్కడికీ తరలివెళ్లడం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక కంపెనీ తరలింపు గురించి కియా అధిపతి పార్క్ కు కూడా తెలియదని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సేల్స్ హెడ్ భట్ పేరుతో పోస్టింగ్స్ ఎలా వచ్చాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వం తరుఫున వాణిజ్యం - పరిశ్రమలు - పెట్టుబడులశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ కూడా అధికారికంగా స్పందించారు. రాయిటర్స్ కథనంలో ఎలాంటి నిజం లేదని.. కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవడం లేదని స్పష్టం చేశారు. ఇక వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపారు.
ఇక వివాదానికి కేంద్రబిందువైన కియా కంపెనీ కూడా ఈ వార్తపై స్పందించింది. గతంలో కూడా తాము మహారాష్ట్రకు తరలిపోతున్నట్టు వార్తలు సృష్టించారని.. ఇప్పుడు తమిళనాడుకు పోతున్నామని అంటున్నారు. ప్లాంట్ తరలింపుపై ఎలాంటి ఆలోచలన లేదని సవివరంగా క్లారిటీ ఇచ్చింది. ఏపీ సర్కారుతో విభేదాలు లేవని.. తాము జగన్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నామని కియా కంపెనీ అధికారికంగా తెలిపింది.
ఇలా కియా కంపెనీతోపాటు ఏపీ ప్రభుత్వం తరుఫున అధికారులు, మంత్రి క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ - పచ్చమీడియా గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారింది. దీన్ని రాజకీయ దురుద్దేశంతో వాడుకుందామని యోచించిన టీడీపీ - పచ్చ మీడియా బ్యాచ్ అభాసుపాలైంది. బొక్కొ బోర్లా పడింది. ఇప్పుడు ఈ వార్తను ప్రచారం చేసిన రాయిటర్ సంస్థపై న్యాయ పోరాటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ వార్త సంస్థపై పరువు నష్టంతోపాటు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.