Begin typing your search above and press return to search.

నిన్న‌గాక మొన్న 2500 కోట్ల అప్పు.. మ‌ళ్లీ ఢిల్లీకి మంత్రి బుగ్గ‌న‌

By:  Tupaki Desk   |   11 Jan 2023 5:30 PM GMT
నిన్న‌గాక మొన్న 2500 కోట్ల అప్పు.. మ‌ళ్లీ ఢిల్లీకి మంత్రి బుగ్గ‌న‌
X
ఈ నెలలో ఏపీ ప్ర‌భుత్వం సెక్యూరిటీల‌ను వేలం వేసి.. ఆర్బీఐ నుంచి 2500 కోట్ల వ‌ర‌కు అప్పులు తెచ్చింది. నిజానికి ప్ర‌భుత్వం 12 వేల కోట్ల వ‌ర‌కు అప్పు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించి కేంద్రం ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసింది. అయితే.. కేంద్రం మాత్రం ఎందుకో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే.. రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు ఇవ్వాల్సి ఉంద‌ని బ్ర‌తిమాలిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎట్ట‌కేల‌కు గ‌త శుక్ర‌వారం.. రూ.2500 కోట్ల‌కు అనుమ‌తి తెచ్చుకున్నారు.

ఆ వెంట‌నే ఆర్బీఐకి లేఖ‌పంపించ‌డం.. అది షెడ్యూల్‌లో పెట్ట‌డంతో వెంట‌నే అప్పు పుట్టేందుకు మార్గం సుగ‌మమైంది. గ‌త మంగ‌ళ‌వారం ఆర్బీఐ సెక్యూరిటీలు వేలం వేసి అప్పు ఇచ్చింది. అయితే.. ఇంత‌లోనే మ‌ళ్లీ ఏపీ ఆర్థిక శాఖ‌ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మ‌రోసారి అప్పున‌కు ప్ర‌య‌త్నాల్లో మునిగిపో యిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. గ‌త డిసెంబ‌రు 28న కూడా రాష్ట్రం రూ.2000 కోట్లు అప్పు చేసింది.

మ‌రి ఈ సొమ్మంతా ఏం చేస్తున్న‌ట్టు? అంటే.. తాజాగా జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌కు రూ.400 కోట్ల‌ను పంపిణీ చేశారు. మ‌రికొంత మొత్తాన్ని ఆర్బీఐకి వ‌డ్డీ కింద జ‌మేసిన‌ట్టు తెలుస్తోంది. కొంత మొత్తం ఉద్యోగుల‌కు జీతాల కింద ఇచ్చారు. మ‌రి ఇంత‌లోనే అప్పు చేసే ప‌రిస్థితి ఎందుకు వెళ్తున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాజాగా బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ వ‌ర్గాల‌తో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా మ‌రోసారిరూ.5 వేల కోట్లు అప్పుగా తెచ్చుకునేందుకు అనుమ‌తి కోర‌న‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే ఆర్బీకి రాష్ట్ర ప్ర‌భుత్వం వేజ్ అండ్ మీన్స్ కింద రూ.4950 కోట్ల మేర‌కు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధుల‌ను ఈ సారి జ‌మ చేయ‌క‌పోతే.. వేలంలో కూడా ఏపీ పాల్గొనే అవ‌కాశం లేద‌ని.. ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.