Begin typing your search above and press return to search.
ఏపీలో మద్యం దుకాణాలపై మంత్రి కీలక ప్రకటన!
By: Tupaki Desk | 17 July 2019 12:09 PM GMTఏపీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నియంత్రించబోతోందని - ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు సాగుతాయని గత కొన్నాళ్లుగా ఊహాగానాలున్నాయి. వాటికి మరింత ఊతం ఇచ్చారు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మద్యనిషేధ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వమే మద్యాన్ని నియంత్రించాలని నిర్ణయించినట్టుగా ఆయన ప్రకటించారు.
మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నట్టుగా బుగ్గన స్పష్టం చేశారు. ఇందు కోసమని ఇప్పటికే బెల్టు షాపులను పూర్తిగా నిషేధించినట్టుగా మంత్రి తెలిపారు. ఇక తదుపరి దశలో మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలిపారు.
మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తుల నియంత్రణలో ఉండటం వల్ల మద్యపానంపై నియంత్రణ లేకుండా పోతోందని.. అందుకే ప్రభుత్వమే రంగంలోకి దిగి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుని - మద్యం అమ్మకాలను నియంత్రించనుందని బుగ్గన వివరించారు.