Begin typing your search above and press return to search.

బుగ్గ‌న ఇలాకాలో వైసీపీ క‌ష్టాలు!

By:  Tupaki Desk   |   20 Feb 2022 12:30 AM GMT
బుగ్గ‌న ఇలాకాలో వైసీపీ క‌ష్టాలు!
X
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి, వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మేధావి.. క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సెగ‌ను ఎదుర్కొంటున్నారు.

వైసీపీ ఆవి ర్భావం నుంచి పార్టీలో ఉన్న బుగ్గ‌న .. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. క‌ర్నూ లు జిల్లాకు ఒక‌ప్పుడు కాంగ్రెస్ కంచుకోట‌. అలాంటి జిల్లాలో ఆయ‌న రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకు న్నారు. అయితే.. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ‌బుగ్గ‌న ప‌రిస్థితి బాగానేఉన్నా.. ఇటీవ‌ల కాలంలో మాత్రం యూట‌ర్న్ తీసుకుంటోంద‌నే సంకేతాలు అందుతున్నాయి.

గ‌త ఆరు మాసాల నుంచి బుగ్గ‌నకు ఇక్కడ రాజ‌కీయ సెగ త‌గులుతోంది.  గ‌త ఏడాది పంచాయ‌తీ ఎన్నిక లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే.. బుగ్గ‌న ఇలాకాలో వైసీపీ పుంజుకుంటుంద‌ని.. పార్టీనేత‌లకు  తిరుగులేద‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే.. ఇక్క‌డ వైసీపీ ఓడిపోయి.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. టీడీపీకి కొత్త‌గా నియ‌మితులైన ఇంచార్జ్ ధ‌ర్మారం సుబ్బారెడ్డి.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. పార్టీలో నిత్య జోష్ ఉండేలా చూస్తున్నారు. అంతేకాదు..నాయ‌కుల‌ను క‌లుపుకొని పోతున్నారు.

గ్రామ‌స్థాయిలో టీడీపీని యాక్టివేట్ చేయ‌డంలో సుబ్బారెడ్డి దూకుడుగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డంతోపాటు.. అంద‌రికీ అందుబాటులోనూ ఉంటున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై టీడీప‌పీ అధినేత పిలుపు మేర‌కు సుబ్బారెడ్డి నిర‌స‌న‌ల జోరు కొన‌సాగిస్తున్నారు. అదేస‌య‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల అవినీతిని కూడా ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలావుంటే.. వైసీపీలోనే ఉన్న కొంద‌రు అస‌మ్మ‌తి నేత‌లు.. నేరుగా ధ‌ర్మారం సుబ్బారెడ్డి కొనియాడుతు న్నారు. టీడీపీ జోష్ పెరుగుతోంద‌ని అంట‌న్నారు.

అంతేకాదు... మంత్రి అస‌లు అందుబాటులో కూడా ఉండ‌డం లేద‌ని... క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. సొంత‌పార్టీ కేడ‌ర్‌లోనే చ‌ర్చ సాగుతోంది. ఈ న‌నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుగ్గ‌న గెలుపు క‌ష్ట‌మ‌నేభావ‌న‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా మంత్రి బుగ్గ‌న మేల్కొంటారా?  క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అదుపు చేసేందుకు, పార్టీని ప‌రుగులు పెట్టేందుకు కృషి చేస్తారా? అనేది చూడాలి.