Begin typing your search above and press return to search.
అమెరికా కూలిన బిల్డింగ్..ఇండో - అమెరికన్ కుటుంబం గల్లంతు
By: Tupaki Desk | 29 Jun 2021 10:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో గత వారం ఓ భారీ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలోని మియామీలో ఈ నెల 24న ఒక 12 అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భవన ప్రమాదంలో భారతీయ అమెరికన్ కుటుంబం గల్లంతయింది. ఈ భవనం కూలిన ఘటన లో 150 మంది గల్లంతు కాగా వారిలో ఓ ఇండియన్-అమెరికన్ కుటుంబం కూడా ఉంది. ఈ దుర్ఘటనలో విశాల్ పటేల్, ఆయన భార్య భావనా పటేల్, వారి ఏడాది వయసున్న కూతురు కనిపించడం లేదని వారి బంధువులు తెలిపారు. భావనా పటేల్ నాలుగు నెలల గర్భవతి. ఇప్పటివరకు వీరి ఆచూకీ తెలియడంలేదని విశాల్ పటేల్ మేనకోడలు సరీనా పటేల్ తెలిపింది.
ఇక్కడ ఉన్న మొత్తం 136 యూనిట్లలో 55 యూనిట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 9మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. కాగా శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు ఇంకా యత్నిస్తున్నాయి. ఈ భవనంలో అర్జెంటీనా, పరాగ్వే, కొలంబియా, దేశాలకు చెందిన కుటుంబాలు, యూదులు కూడా నివసిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన వారైనప్పటికీ వీరంతా ఒకే కుటుంబంలా ఐకమత్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు. ఏదైనా అద్భుతం జరిగి కనీసం శిథిలాల నుంచి తమవారు బతికి బయట పడతారా అని వీరి బంధువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫ్లోరిడా గవర్నర్ ఈ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. మరికొన్ని రోజులైనా సహాయక చార్యులలు కొనసాగుతాయని భావిస్తున్నారు.