Begin typing your search above and press return to search.

భారత్ లో బుల్లెట్ ట్రైన్ టికెట్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:22 AM GMT
భారత్ లో బుల్లెట్ ట్రైన్ టికెట్ ఎంతంటే?
X
డిమాండ్ కు తగ్గ రైళ్లు లేకపోవటంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సంప్రదాయ రైళ్లకు బదులుగా వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లను దేశంలోకి తీసుకొస్తున్న వైనంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాల్ని తాజాగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్ ట్రైన్ 2023 డిసెంబరులో పట్టాల మీద పరుగులు తీయనుంది.

ముంబయి - గుజరాత్ లలో తిరిగే ఈ ట్రైన్ మొత్తం 35 ట్రిప్పులు (అప్ అండ్ డౌన్) తిరగనుంది. ఈ ట్రైన్ 508 కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ సమయంలో పరుగులు తీసేలా ప్లాన్ చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య మొత్తం పన్నెండు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇక.. ట్రైన్ టికెట్ ధరను ప్రాథమికంగా రూ.3వేలుగా డిసైడ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రస్తుతం ముంబయి - అహ్మదాబాద్ మధ్య విమాన టికెట్ కనిష్ఠంగా రూ.1500 నుంచి రూ.2500 లోపే ఉంటోంది. దీనికి మించిన బుల్లెట్ ట్రైన్ టికెట్ ధర ఉండటం గమనార్హం.

విమాన టికెట్ కు మించి బుల్లెట్ ట్రైన్ టికెట్ ఉండటంతో ప్రయాణికులు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారా? అన్నది క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు. ఇక.. ఈ ప్రాజెక్టులో భాగంగా 1380 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో సగాన్ని(సుమారు 622 హెక్టార్లు) సేకరించారు. భూసేకరణ కోసమే దాదాపు రూ.17వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు రూ.లక్షకోట్లు దాటనుందని అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ గుజరాత్.. దాద్రానగర్ హైవేలీ కేంద్రపాలిత ప్రాంతంలోనూ నడవనుంది. బుల్లెట్ ట్రైన్ ఆగే స్టేషన్ల విషయానికి వస్తే..

% థానె
% విరార్
% బాయ్సర్
% వాపి
% బిలిమోరా
% సూరత్
% భారుచ్
% వడోదరా
% ఆనంద్/నదియాద్
% అహ్మదాబాద్
% సబర్మతి