Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్తింటి బాత్రూం ముచ్చట తెలుసా?
By: Tupaki Desk | 23 Nov 2016 7:50 AM GMTరేపు తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి గృహప్రవేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. తానే స్వయంగా అన్నీ అంశాల్ని చూసుకోవటంతో పాటు.. తన సూచనలతో కేసీఆర్ ‘తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని’ తయారు చేయించినట్లుగా చెబుతారు. ముంబయికి చెందిన షాపూజీ పల్లోంజి గ్రూపు నిర్మించిన ఈ భవనాన్ని భారీ ఖర్చుతో అత్యంత అధునిక పద్ధతిలోనిర్మించినట్లుగా చెబుతున్నారు.
మిగిలిన భవనం సంగతి ఎలా ఉన్నా..కేసీఆర్ కొత్తింటి బాత్రూం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.మొత్తంలక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో వెంటిలేటర్లు.. కిటికీలతో సహా అన్ని అద్దాలకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం.. చేసిన సూచనలకు తగ్గట్లుగా ఇంటి మొత్తాన్ని హైక్వాలిటీ గ్లాస్ తో నిర్మించినట్లుగా చెబుతున్నారు.
ఇక.. బాత్రూంను సైతం బుల్లెట్ తగిలినా చెక్కు చెదరని అద్దాలతో నిర్మించినట్లు సమాచారం. మొత్తంగా చెప్పాలంటే.. కేసీఆర్ కొత్తిల్లు మొత్తం బుల్లెట్ ఫ్రూప్ భవనంగా అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ ఉపయోగించే గదులతో పాటు.. ఆయన కుమారుడు.. మంత్రి కేటీఆర్ ఉపయోగించే రెండు బెడ్రూంలను కూడా హైక్వాలిటీ గ్లాస్ తో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటికి వినియోగించిన గ్లాస్ నాణ్యత గురించి చెబుతున్నవారి మాటల ప్రకారం.. దూరం నుంచి వచ్చే స్నిప్పర్ రైఫిల్ బుల్లెట్లను కూడా అడ్డుకుంటాయని చెబుతున్నారు. భవన నిర్మాణంలో తాజాగా తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. జెడ్ ప్లస్ కేటగిరిని తలదన్నేలా రక్షణ చర్యలు కొత్త ఇంటి కోసం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ కొత్త భవనాన్ని ప్రస్తుతం నివాసం ఉంటున్న సీఎం క్యాంపు ఆఫీసు వెనుక 9 ఎకరాల స్థలంలో నిర్మించారు. దాదాపు వెయ్యి మందితో సమావేశం అయ్యేలా మీటింగ్ హాలు.. ఇంటి చుట్టూ పచ్చదనంతో కళకళలాడేలా మొక్కలు నాటటంతో పాటు.. కేసీఆర్ సూచన మేరకు పలు ఔషద మొక్కల్ని కూడా సేకరించి.. ఈ కొత్తింట్లో ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. వాయు వేగంగా నిర్మించిన ఈ ఇంటిని కేవలం తొమ్మిది నెలల్లో పూర్తి చేయటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/