Begin typing your search above and press return to search.
బుమ్రా.. భలే బౌలింగ్ - టెస్టులో మూడో క్రికెటర్ గా!
By: Tupaki Desk | 1 Sep 2019 4:58 AM GMTవెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి తన బౌలింగ్ తో గర్జించాడు జస్ప్రీత్ బుమ్రా. ప్రపంచంలో ఇప్పుడు క్రేజీయెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బుమ్రా హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన మూడో భారత బౌలర్ గా నిలిచాడు బుమ్రా.
ఇది వరకూ హర్బజన్ సింగ్ భారత్ తరఫున టెస్టుల్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఆస్ట్రేలియా మీద ఆ రికార్ఢు స్థాపించాడు ఆ స్పిన్ బౌలర్. ఆ తర్వాత పాకిస్తాన్ మీద ఇర్ఫాన్ ఫఠాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఆ అరుదైన రికార్డును ఇప్పుడు బుమ్రా సాధించాడు.
బుమ్రా ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్ మన్ బెంబేలెత్తారు. రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు సాధించింది. తెలుగు ఆటగాడు హనుమ విహారి సెంచరీ సాధించి సత్తా చూపించాడు. అనంతరం విండీస్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. బుమ్రా ధాటికి బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది. 87 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయింది వెస్టిండీస్. ఇందులో ఆరు వికెట్లు బుమ్రానే తీయడం గమనార్హం.