Begin typing your search above and press return to search.
కుక్కలపై రాళ్లు విసురుతూ పోతే గమ్యం చేరలేవు.. విమర్శలపై బుమ్రా
By: Tupaki Desk | 6 Oct 2022 10:44 AM GMT''టీమిండియాకు నాలుగు మ్యాచ్ లు ఆడలేవు కానీ.. ఐపీఎల్ లో మాత్రం అన్ని మ్యాచ్ లు ఆడతావు..'' ''లీగ్ క్రికెట్ కోసమే.. గాయాలను సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నావు..'' ఇవీ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై వస్తున్న విమర్శలు. అసాధారణ శైలి పేసర్ అయిన బుమ్రా కొంతకాలంగా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్నాడు. వెస్టిండీస్ టూర్ నుంచి అతడు టీమిండియాకు అందుబాటులో ఉన్నది చాలా తక్కువ. కీలకమై ఆసియా కప్ నకూ దూరమయ్యాడు. అందులోనూ టి20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్.. ఈ నెలలో జరిగే ప్రపంచకప్ నకు మంచి సన్నాహకం.
కానీ, బుమ్రా వెన్నుగాయంతో దూరమయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ఎంపిక చేయగా.. ఆడిందే లేదు. దానికిముందు ఆస్ట్రేలియా సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో 50 పరుగులిచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే గత మూడు నెలల్లో అతడు టీమిండియాకు ఆడిన మ్యాచ్ లు ఈ రెండే. చివరకు వెన్నుగాయంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ నకే అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, బుమ్రా ఈ ఏడాది వేసవిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అన్ని మ్యాచ్ లు ఆడడం గమనార్హం. దీంతోనే అతడిపై విమర్శలు వస్తున్నాయి.
కపిల్ చెప్పినట్లే జరుగుతోందా..?
''బుమ్రా గొప్ప బౌలరే.. కానీ, అతడి బౌలింగ్ శైలి ఆందోళనకరం. ఆ తరహా యాక్షన్ తో త్వరగా గాయాలవుతాయి''ఈ మాటలన్నది దిగ్గజ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్. గత కొన్ని నెలలుగా బుమ్రా ఎదుర్కొంటున్ పరిస్థితి చూస్తే ఇదే నిజమని అనిపిస్తోంది. మూడు నెలలుగా అతడు ఏదో ఒక సిరీస్ కు దూరం అవుతున్నాడు. బుమ్రా బంతిని వేసేటప్పుడు సాధారణ బౌలర్ కంటే మరింత ఎక్కువగా శరీరాన్ని వంచుతాడు.
దీంతోనే అతడికి గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాస్తవానికి 8 ఏళ్ల కెరీర్ లో ఈ ఏడాది బాధపడినంతగా మరెప్పుడూ బుమ్రా గాయాలతో ఇబ్బంది పడలేదు. అదికూడా టి20 ప్రపంచ కప్ ఉన్న సమయంలో గాయాలకు గురికావడంతో అభిమానులకు మరింత చిర్రెత్తింది. అయితే, గాయాలనేవి తన చేతుల్లో లేనివి కాబట్టి అభిమానుల వ్యాఖ్యలకు బుమ్రా దీటుగా సమాధాన ఇచ్చాడు. ఏకంగా బ్రిటిష్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ అన్న మాటలను గుర్తుచేస్తూ విరుచుకుపడ్డాడు.
అతడి బంతుల్లాగే కౌంటరూ బుల్లెట్టే..
సోషల్ మీడియాలో ట్రోలింగ్ ల పట్ల విసిగిపోయాడో ఏమో..? బుమ్రా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్టు చేశాడు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. ''మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే నువ్వు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు'' అని బుమ్రా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఇది చర్చిల్ కొటేషన్. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ నుంచి బుమ్రా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత బుమ్రా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. పొట్టి ప్రపంచకప్ జట్టులో భాగం కాలేకపోవడం భావోద్వేగానికి గురి చేసిందని, అయితే గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా గైర్హాజరీతో వరల్డ్ కప్ ప్రధాన జట్టులోకి ఆటగాడి పేరును బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.