Begin typing your search above and press return to search.

బండ్ల ట్వీట్ల వర్షం స్కాం రాజా అంటూ సెటైర్లు

By:  Tupaki Desk   |   7 Oct 2019 11:48 AM GMT
బండ్ల ట్వీట్ల వర్షం స్కాం రాజా అంటూ సెటైర్లు
X
బండ్ల గణేష్ ట్విట్టర్ సాక్షిగా రెచ్చిపోయారు. కొద్దిరోజులుగా గొడవ పడుతున్న పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) టార్గెట్ గా ట్విట్టర్ లో పరోక్ష విమర్శలు చేసినట్టు అర్థమవుతోంది..ఇటీవలే దాడులు కూడా చేసుకున్న బండ్ల గణేష్, పీవీపీలు పోలీస్ స్టేషన్ గడపతొక్కిన సంగతి తెలిసిందే..

అప్పట్లో వచ్చిన టెంపర్ సినిమా ఆర్థిక వ్యవహారాల్లో నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీల మధ్య తేడాలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం ముదిరి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది.

తాజాగా బండ్ల గణేష్ మరోసారి ఆ వివాదాన్ని ట్విట్టర్ సాక్షిగా కెలికాడు.. పీవీపీని టార్గెట్ చేస్తూ ఆయన పేరు ప్రస్తావించకుండా వరుస ట్వీట్లతో హోరెత్తించారని అర్థమవుతోంది. బండ్ల ట్వీట్స్ పీపీవీ టార్గెట్ గానే చేశారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్కాం రాజా అని పిలుస్తూ పరోక్షంగా బండ్ల కామెంట్స్ చేశాడు. ‘ టెంపర్ సినిమా ఫంక్షన్లో కష్టాల్లో ఉన్నానని.. ఇమేజ్ పెంచు అని నువ్వు నా కాళ్లు పట్టుకునేంత పనిచేశావ్.. మర్చిపోకు’ అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది.

ఇక స్కాం రాజా అంటూ ట్వీట్ తో బండ్ల దెప్పిపొడిచాడు. నువ్వు బొంబాయ్ లో ఒక్క రోజు జల్సా చేసినంత కాదు నా బతుకు.. నీవు చేసిన స్కాములు దేశ విదేశాల్లో కీర్తి పొందాయి.. స్కాములకు మూలం నీవు.. దొంగ సంతకాలతో జీవితాలను భష్ట్రు పట్టించావ్’ అంటూ బండ్ల సంచలన కామెంట్స్ తో ట్వీట్ చేశారు.

ఇక నీలాగా రోజుకొక పార్టీ.. గంటకొక మనిషి.. భజన చేస్తూ, తిడుతూ వాళ్ల దగ్గరికే వెళ్లే నిన్ను జనం చీదరించినా చిత్కరించినా ఆ పార్టీలను పట్టుకొని వేలాడుతూనే ఉంటావ్ అని బండ్ల గణేష్ పరోక్ష విమర్శలు చేశారు.

ఇప్పటికైనా పిచ్చివేశాలు మానుకో.. నిజాయితీగా బతుకు.. 30 ఏళ్లు ఇక్కడే ఉంటా ఇండస్ట్రీలో చచ్చిపోతా నీలా ఎవ్వరాలు.. స్కాంలు ఉండవు అంటూ ట్వీట్లతో బండ్ల గణేష్ హోరెత్తించాడు.