Begin typing your search above and press return to search.
కాలిపోతున్న ఆర్ఎస్ఎస్ నిక్కర్.. కాంగ్రెస్ ట్వీట్లపై పెనుదుమారం
By: Tupaki Desk | 12 Sep 2022 3:32 PM GMTదేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ‘జోడో పాదయాత్ర’తో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. దీంతో బీజేపీపై ఇప్పుడు దూకుడుగా దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ కొంగొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర నేపథ్యంలో దానికి మద్దతుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇదే క్రమంలోనే ఆర్ఎస్ఎస్ చెడ్డి ఫొటోతో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ లో ఆర్ఎస్ఎస్ చెడ్డీ తగలబడుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఫొటోతోపాటు మరో 145 రోజులంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. దీంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరో 145 రోజులు పూర్తి చేసుకుంటే భారత్ లో విద్వేషం కూడా ఇలా కాలిపోతుందనే అర్థం వచ్చేలా ఈ ట్వీట్ పెట్టారు. దీంతో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన పోరాటాన్ని ప్రతిబింబించేలా ఈ ట్వీట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో సహజంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు దీనికి కౌంటర్లు మొదలుపెట్టాయి.
దీనిపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పెట్టిన ఈ ట్వీట్ తో భారత్ లో విద్వేషం నింపదలుచుకున్నారా? అంటూ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ప్రశ్నించారు. అలాగే బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య కూడా రెచ్చిపోయారు. గతంలో 1984లో కాంగ్రెస్ ఢిల్లీలో ఓ నిప్పు పెట్టిందని.. ఆ తర్వాత 2002లో కరసేనకుల్ని ఆ పార్టీ సానుభూతిపరులు గోద్రాలో నిప్పు పెట్టారని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ హింసను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపించారు.
కాంగ్రెస్ రాజేసిన నిప్పుతో గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయారని.. ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లో కూడా అధికారం పోగొట్టుకుంటారని విమర్శించారు.
కాగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగనుంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితప్రాతాలను కవర్ చేయనుంది. 150 రోజుల పాటు 3570 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. ప్రస్తుతం ఈ యాత్ర కేరళలో కొనసాగుతోంది.
ఈ యాత్లరో రాహుల్ గాంధీ ఎంతో యాక్టివ్ గా ముందుకు సాగుతున్నారు. వెళ్లే మార్గంలో తమ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను మరింత లోతుగా ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.