Begin typing your search above and press return to search.

జీవిత బీమా సొమ్ము కోసం భర్తను కాల్చేసింది !

By:  Tupaki Desk   |   11 April 2021 12:30 AM GMT
జీవిత బీమా సొమ్ము కోసం  భర్తను కాల్చేసింది !
X
జీవిత బీమా పాలసీ చేయించటానికి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరికైనా ఏంచెప్తాడు అంటే .. సార్ మీరు ఇప్పుడు బాగున్నారు, దురుదృష్టవశాత్తు ప్రమాదంలోనో , మరో కారణంతోనో మరణిస్తే మీ కుటుంబానికి రక్షణ ఏది సార్ , అందుకే మీరు మీ జీవితాన్ని బీమా చేయించుకోండి సార్ అంటూ అభ్యర్దిస్తాడు. అనుకోని ఘటనలో మీరు మరణిస్తే మీ కుటుంబానికి లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుందని ఆశ చూపిస్తాడు. భర్త పేరుమీద ఉన్న కోటి రూపాయల బీమా సొమ్ము కోసం ఓ ఇల్లాలు ఏకంగా తాళి కట్టిన భర్తను హతమార్చింది. బీమా సొమ్ము క్లైయిమ్ చేసుకోవాలనుకున్న ఆమె ఆశ అడియాశలయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టటంతో కధ మొదటికొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే .. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. బీమా సొమ్ము కోసం కట్టుకున్న భర్తలనే భార్యలు చంపడానికి వెనుకాడటం లేదు. భర్త పొతే బీమా సొమ్ము వస్తుంది అని ఆలోచించే మహిళలు , ఆ తర్వాత భర్త లేకపోతే సమాజంలో ఉండే గుర్తింపు , పలకరింపులు ఏమౌతాయో ఆలోచించడం లేదు. తాజాగా తమిళనాడు లో ఓ మహిళా తన భర్త పేరు మీద ఉన్న రూ. 3 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తనే అత్యంత కిరాతకంగా కారుతో సహా తగలబెట్టేసింది. తమిళనాడు ఈరోడ్ జిల్లా కి చెందిన రంగరాజన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. తాజాగా అయన కొంచెం అనారోగ్యానికి గురైయ్యాడు. దీనితో అతని భార్య ఆయన్ని హాస్పిటల్ కి తీసుకుపోయింది. అయితే , ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువస్తుండగా కారుకి నిప్పు పెట్టి కారుతో సహా భర్త ను తగలబెట్టింది. ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది అని కట్టుకథ చెప్పింది. అయితే , ఆ తర్వాత పోలీసుల విచారణలో ఓ ప్లాన్ ప్రకారమే అతడి భార్యనే , అతని బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తితో కలిసి హత్య చేసింది అని పోలీసులు బయటపెట్టారు.