Begin typing your search above and press return to search.

బస్సును ఢీకొట్టిన రైలు.. 29మంది మృతి

By:  Tupaki Desk   |   3 July 2020 7:00 PM IST
బస్సును ఢీకొట్టిన రైలు.. 29మంది మృతి
X
పొరుగుదేశం పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న బస్సును అతివేగంగా వస్తున్న ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 29మంది సిక్కు యాత్రికులు మృతిచెందడం విషాదం నింపింది. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

పంజాబ్ ప్రావిన్స్ లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. ఒకే ఫ్యామిలీకి చెందిన 35మంది సిక్కు యాత్రికులు మినీ బస్సులో నంకానా సాహెబ్ కు వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం గురుద్వారా సచ్ఛ సౌదాకు వెళుతున్నారు.ఈ క్రమంలోనే ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీ కొట్టింది.

ఈ ధాటికి బస్సు దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకుపోయింది. బస్సు తునాతునకలైంది. రైలుపట్టాలకు ఇరువైపులా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఈ ప్రమాదంలో 39మంది సంఘటన స్థలంలోనే మరణించారు. ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.