Begin typing your search above and press return to search.

నోట్లు రద్దు ఎఫెక్ట్ లేని ఆ రెడ్ లైట్ ఏరియా

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:33 PM GMT
నోట్లు రద్దు ఎఫెక్ట్ లేని ఆ రెడ్ లైట్ ఏరియా
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న కలకలం అంతా ఇంతా కాదు. పెద్దనోట్ల రద్దు కారణంగా వీధి చివరన ఉన్న టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు తీవ్రప్రభావానికి గురయ్యాయి. రోజుకు ఐదారు వేల రూపాయిలు అమ్మే టిఫిన్ సెంటర్ సైతం తక్కువలో తక్కువ వెయ్యి రూపాయిల వరకూ వ్యాపారం తగ్గినట్లుగా చెబుతున్నారు. ఒక చిన్న టిఫిన్ సెంటర్ పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే.. ఆసియాలోని అతి పెద్దదైన రెడ్ లైట్ ఏరియాగా పేరున్న పశ్చిమబెంగాల్ కు చెందిన సోనాగచిలో మాత్రం పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమాత్రం పడలేదని చెబుతున్నారు. వేలాదిగా ఉండే సెక్స్ వర్కర్లు ఎప్పటిలానే బిజీబిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత వారి వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం పడకపోవటానికి ఒక కీలక కారణం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికీ అక్కడ రూ.500.. రూ.వెయ్యి నోట్లను నో చెప్పటం లేదు. దీంతో.. సదరు రెడ్ లైట్ ఏరియాలో ఎప్పటి మాదిరి కళకళలాడటమే కాదు.. మరికాస్తఎక్కువ వ్యాపారం జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.

దేశమంతా పెద్ద నోట్లకు నో అంటే నో అని చెబుతుంటే సోనాగచి రెడ్ లైట్ ఏరియాకు చెందిన సెక్స్ వర్కర్లు చెల్లుబాటు కాని నోట్లను ఎలా తీసుకుంటున్నారన్న సందేహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా అక్కడి ఉషా కో ఆపరేటివ్ బ్యాంకు ఇచ్చిన అభయ హస్తమే కారణంగా చెప్పొచ్చు. ఈ నెల 30వరకు సెక్స్ వర్కర్లు ఇచ్చే పెద్దనోట్ల (రూ.500, రూ.1000)ను ఈ నెలాఖరు వరకూ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో.. దేశం మొత్తం ఒకలాంటి పరిస్థితి ఉన్నాసోనాగచిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉషా కో ఆపరేటివ్ బ్యాంకులో దాదాపు 30వేల మంది సెక్స్ వర్కర్లకు సంబంధించిన అకౌంట్లు ఉన్నాయట. దీంతో.. వారందరూ తమకు వచ్చిన పెద్ద నోట్లను బ్యాంకులో మార్చుకునే సౌలభ్యం ఇవ్వటంతో వారు యథావిధిగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. కాకపోతే.. ఆ బ్యాంకులో అకౌంట్ లోని అతి కొద్ది మంది సెక్స్ వర్కర్లకు మాత్రం కాస్త ఇబ్బందికి గురి అవుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/