Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడో మీకు తెలుసా?
By: Tupaki Desk | 17 Aug 2021 11:30 PM GMTబిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ గురించి దాదపు అందరికీ తెలిసి ఉంటుంది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరిట అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి కీర్తి గడించాడు ఎలన్ మస్క్. స్పేస్ గురించిన పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు ఎలన్. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’తో కలిసి అనేక ప్రాజెక్టులను స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మనుషులను అంగారకుడిపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్సేష్ షిప్‌ను తయారు చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన షిప్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రీయూజెబుల్ స్పేస్‌షిప్ ద్వారా వంద మందిన మందిని రెడ్ ప్లానెంట్ పైకి తీసుకెళ్లాలన్నది ఎలన్ మస్క్ సంకల్పం. అయితే, అరుణ గ్రహం మీద మానవ జీవనానికి అనుకూలమైన పరిస్థితులు ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పంపిన ‘పర్సెవరెన్స్’రోవర్ అరుణ గ్రహ ఉపరితలం మీదకు ల్యాండ్ అయి అక్కడి పరిస్థితులను చక్కగా రికార్డు చేసి భూమి మీదకు పంపుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పరిశోధకులు అంగారక గ్రహం మీద మానవాళి జీవనాధార పరిస్థితులపై అంచనా వేస్తున్నారు. అయితే, అంగారక గ్రహంపై జీవాన్వేషణ ఈనాటిది కాదన్న సంగతి అందరికీ విదితమే. కొన్నేళ్ల నుంచి ఈ రెడ్ ప్లానెట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే జరిగిన పలు అధ్యయనాలు, పరిశీలనల ప్రకారం.. అంగారక గ్రహంపై నీరు ఆవిరి అయి గడ్డ కట్టి మంచు రూపంలో ఉందని తేలింది. దాంతో స్పేస్ రోవర్స్ ద్వారా అక్కడికి బాంబులను తీసుకెళ్లి ఆ మంచు గడ్డలపై వేసి నీటిని బయటకు తీయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెడ్ ప్లానెట్‌పై హ్యూమన్ లివింగ్ ప్లస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆస్ట్రోనాట్లను సైతం మార్స్‌పైకి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలకు అంగారక గ్రహం ఫేవరెట్‌గా మారిపోయింది. దాంతో అన్ని దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు స్పేస్‌క్రాఫ్ట్స్‌ను పంపుతూనే ఉన్నాయి. ఫలితంగా మార్స్ గ్రహాన్ని స్పేస్‌క్రాఫ్ట్స్ చుట్టుముట్టుతున్నాయి. అలా స్పేస్ క్రాఫ్ట్స్‌కు కేరాఫ్‌గా అరుణ గ్రహం తయారవుతున్నది. ఈ సంగతులు ఇలా ఉంచితే పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్‌కు కూడా అంగారక గ్రహం అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అక్కడికి కంపల్సరీ వెళ్లి, మానవులు అక్కడ ఉండగలరు అని ప్రూవ్ చేయాలని ఎలన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పేస్ ఎక్స్, ‘నాసా’ సహకారంతో ‘స్పేస్ షిప్’ రూపొందిస్తున్నారు. కాగా, స్పేస్‌లో ప్రయాణం అంటే కేవలం మాటలు కాదని ఎలన్ మస్క్ పేర్కొంటున్నారు. ప్రాణాలతో చెలగాటమే స్పేస్‌లో ప్రయాణం అని మస్క్ చెప్తున్నారు.
తనకు మరణం అంటే అస్సలు భయం లేదని అంటున్నారు ఎలన్. అందుకే తాను అంగారకుడిపై మరణించాలని బలంగా కోరుకుంటున్నానని చెప్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు ఎలన్. కాగా, ఎలన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎలన్ మాస్క్ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.