Begin typing your search above and press return to search.

బిజినెస్ మీటింగ్ కి పిలిచి రేప్ చేశాడు

By:  Tupaki Desk   |   2 April 2016 9:39 AM GMT
బిజినెస్ మీటింగ్ కి పిలిచి రేప్ చేశాడు
X
అనుక్షణం ఎంత అప్రమత్తంగా ఉండాలో తాజా ఘటన చెప్పకనే చెప్పేస్తుంది. ఏ చిన్న నిర్లక్ష్యమైనా మూల్యం ఎంత భారీగా ఉంటుందో ఈ ఘటన చెప్పేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. బిజినెస్ మీటింగ్ కోసం ఒక మహిళను పిలిచి.. స్టార్ హోటల్లో చర్చల పేరుతో మాయ చేసి రేప్ చేసిన ఘటన వింటే షాక్ తినక మానరు.

చండీగఢ్ కు చెందిన ఒక యువకుడు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన ఒక మహిళా బిజినెస్ ఉమెన్ తో బిజినెస్ గురించి మాట్లాడారు. దీని గురించి మరింత వివరంగా చర్చలు జరిపేందుకు ఇద్దరు కలవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా ఆమె.. మీటింగ్ కోసం సదరు యువకుడు చెప్పినట్లే ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని హోటల్ లోకి వెళ్లారు. చర్చల నిమిత్తం కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. ముంచుకొస్తున్న ముప్పును ఏ మాత్రం ఊహించని ఆమె.. అతనిచ్చిన డ్రింక్ ను తాగేశారు.

మత్తుమందు ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయారు. ఇదే అదునుగా తీసుకున్న అతడు ఆమెపై అత్యాచారం చేసి చక్కగా వెళ్ళిపోయాడు. కాసేపటికి మెలుకువ వచ్చిన బిజినెస్ ఉమెన్ తన మీద అత్యాచారం జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకుంది. జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.