Begin typing your search above and press return to search.
ఆర్యన్ కేసు సంగతేమో కానీ.. వాంఖడేకు కొత్త తిప్పలు మామూలుగా లేవుగా?
By: Tupaki Desk | 2 Nov 2021 3:30 PM GMTముక్కుసూటి అధికారిగా పేరున్న సమీర్ వాంఖడే గురించి సామాన్య ప్రజలకు బాగా తెలిసింది మాత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నప్పుడే. విలాసవంతమైన క్రూయిజ్ లో జరుగుతున్న హైఫై పార్టీలోకి ఎంటర్ కావటమే కాదు.. ఆర్యన్ తో పాటు బడాబాబుల పిల్లల్ని అదుపులోకి తీసుకోవటంతో సమీర్ పేరు మారుమోగింది. డ్రగ్స్ కేసు విచారణలో బిజీగా ఉన్న ఆయనకు.. గతంలో తాను ఏ కేసును డీల్ చేసినప్పుడు కూడా ఎదురుకాని విచిత్రమైన అనుభవాలు ఆయనకు ఎదురయ్యాయి.
ఎన్నో ఛాలెంజింగ్ కేసుల్ని డీల్ చేసిన ఆయనకు తాజాగా తన మీద పడిన మచ్చల్ని తుడుపుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఆ మాటకు వస్తే.. తన సచ్ఛీలతను.. ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని నిరూపించుకునేందుకు ఆయన కిందామీదా పడుతున్నారు. చెప్పులు అరిగేట్లు తిరుగుతున్నారు. ఉద్యోగానికి సంబంధించిన ప్రాథమిక అంశాన్ని ఇన్నేళ్ల సర్వీసు తర్వాత ఆయన ఫ్రూవ్ చేసుకోవాల్సి రావటం గమనార్హం.
ఇక్కడితో విషయం ఆగిపోకుండా.. ఆర్యన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న వేళ.. అతగాడి విడుదల కోసం కోట్లాది రూపాయిల బేరం జరిగినట్లుగా ఆరోపణలు రావటం.. అవన్నీ తప్పుడు మాటలుగా తేల్చాల్సిన బాధ్యత కూడా వాంఖడే మీద పడింది. తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్ పర్సనర్ విజయ్ సంప్లాను కలిసిన ఆయన.. తన కుల ధ్రువీకరణ పత్రంతో పాటు.. తొలి వివాహానికి సంబంధించిన విడాకుల పత్రాల్ని అందజేశారు.
వాంఖడే ఇచ్చిన పత్రాల్ని తాము చూస్తామని.. ఒకవేళ ఆయన ఇచ్చిన డాక్యుమెంట్లు నిజమని తేలితే.. ఆయనపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. ఒకవేళ.. తప్పుడు పత్రాల్ని సమర్పించి.. ఉద్యోగం సాధిస్తే మాత్రం ఆయనకు పెద్ద ఎత్తున తిప్పలు తప్పవంటున్నారు. మొత్తంగా సంచలన కేసు విచారణలో బిజీగా ఉండాల్సిన వాంఖడే.. తన ప్రాతివత్యాన్ని ఫ్రూవ్ చేసుకోవటంలో బిజీ అయిపోయారని చెప్పాలి. ఆర్యన్ ఎపిసోడ్ కు ముందు తన పరిస్థితి ఇలా మారుతుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.