Begin typing your search above and press return to search.
టీడీపీ నేతల కొట్లాటను ఆపిన సోము వీర్రాజు
By: Tupaki Desk | 6 Feb 2018 5:47 PM GMTటీడీపీ నేతలు - చంద్రబాబుపై ఇంతెత్తున లేచి విమర్శలు చేసే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇద్దరు టీడీపీ సీనియర్ నేతల మధ్య గొడవను ఆపారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రాజమండ్రి కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. వారిద్దరి ఘర్షణ ఎంతకీ తెగకపోవడం - ఇద్దరు నేతలూ మాటామాటా అనుకుంటూ పరువు బజారుకీడ్చుకుంటుండడంతో అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కల్పించుకుని ఇద్దరినీ చల్లబరిచారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు మంగళవారం పరస్పరం విమర్శలు - ఆరోపణలకు దిగారు. ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటూ - దూషించుకున్నారు. రాజమండ్రిలో క్రీడలకు సంబంధించిన నిధుల విషయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు. ఎవరికి వారు నిజాయితీపరులుగా చెప్పుకొంటూ రెండో వ్యక్తిని దూషించారు.
అయితే... ఈ క్రమంలో బుచ్చయ్య వివాదంలోకి చంద్రబాబు - లోకేశ్ పేర్లను కూడా లాగారు. పార్టీలో నానాటికి ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్న గోరంట్ల.. ఆదిరెడ్డిపై మండిపడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - మంత్రి నారా లోకేష్ తన జేబులో ఉన్నారంటూ ఆదిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అనవసర ప్రచారాలు చేసుకునే ఖర్మ తనకేం పట్టలేదంటూ అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ఇద్దరూ చాలాసేపు వాదులాడుకున్నారు. చివరకు వీర్రాజు జోక్యం చేసుకుంటే కానీ గొడవ ఆగలేదు.
కాగా బుచ్చయ్య కొంతకాలంగా పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు గత ఏడాది ఏప్రిల్‌లో మంత్రి వర్గ విస్తరణ చేసినప్పుడు కనీసం తన పేరు కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో అలిగి రాద్ధాంతం చేసిన బుచ్చయ్య చౌదరిని ఆ తరువాత బుజ్జగించడంతో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. కానీ.. పార్టీలో మాత్రం ఆ తరువాత కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మరోవైపు ఆదిరెడ్డి అప్పారావు ఇప్పుడు రాజమండ్రిలో తన హవా చూపిస్తున్నారని... కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడికి వియ్యంకుడైన అప్పారావుకు చంద్రబాబు - లోకేశ్ ల వద్ద మంచి పేరే ఉన్నట్లు చెప్తున్నారు. దానికితోడు ఆయన కూడా చంద్రబాబు - లోకేశ్ ల పేరు చెప్తూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ టిక్కెట్ ఆయనకేనని వినిపిస్తోంది. ఈ ఫ్రస్టేషన్ వల్లే బుచ్చయ్య ఆయనతో గొడవ పడ్డారని తెలుస్తోంది.