Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల‌కు ఇవి సూపించండ్రా..అట్టా వదిలేయకండ్రా

By:  Tupaki Desk   |   5 Feb 2018 10:56 AM GMT
టీడీపీ నేత‌ల‌కు ఇవి సూపించండ్రా..అట్టా వదిలేయకండ్రా
X
కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డంతో టీడీపీకి చెందిన ఆ ఇద్ద‌రు నేత‌లు బీజేపీ పొగ‌రు దించేస్తాం..? వాళ్ల అంతు చూసేస్తాం..? అంటూ మంగ‌మ్మ శ‌ఫ‌దాలు చేస్తున్నారు. ఇక‌ రాష్ట్రాన్ని తామే అభివృద్ది చేస్తున్నామ‌ని టీడీపీ ఊద‌ర‌గొట్టేస్తున్నా ..కాదు తామే కేంద్రం నుంచి నిధులు వ‌చ్చేలా చేస్తున్నాం. ప్ర‌భుత్వం పేరుచెప్పుకొని క్రెడిట్ కొట్టేస్తుందని క‌మలం నేత‌లు మండిప‌డుతున్నారు.

దీనిపై టీడీపీకి చెందిన ప‌లువురు ఎంపీలు - ఎమ్మెల్యేలు క‌మ‌లం పార్టీకి క‌టిఫ్ చెప్పి - 2019 ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీచేద్దాం. పార్ల‌మెంట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై నిన‌దిద్దాం అంటూ ఆ ఇద్ద‌రు తెలుగు త‌మ్ముళ్లు గ‌ట్టిగా వాదిస్తున్నారు. అయితే మిగిలిన నేత‌లు డిఫెన్స్ పాలిటిక్స్ చేస్తుంటే. వీళ్లిద్ద‌రు మాత్రం ఎందుకిలా చెల‌రేగిపోతున్నార‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. బీజేపీని ఆ ఇద్ద‌రు నేత‌లే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?స్వామికార్యం..స్వ‌కార్యం కోస‌మేనా..? లేదా ఇంకేమైనా ఉందా..?

రాష్ట్ర విభ‌జ‌నకు ముందు క‌ర్నూలు లో చ‌క్రం తిప్పిన మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ - ప్ర‌స్తుత టీడీపీ ఎంపీ టీజీ వెంక‌టేష్ . నాటి ప‌రిస్థితుల దృష్ట్యా టీడీపీ తీర్ధం పుచ్చుకొని పార్ల‌మెంట్ లో పార్టీ త‌రుపున‌, రాష్ట్రంలో పార్టీ త‌రుపున మిత్ర‌ప‌క్షమైన బీజేపీపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. పీఎం మోడీ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో టీజీ బీజేపీ పై విమ‌ర్శ‌లకు ప‌దును పెడుతున్నారు. వాటిని వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సంధిస్తున్నారు. మొన్న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం రాష్ట్రంలో బీజేపీ హ‌వా ఎక్కువ‌గా ఉంద‌ని పొగ‌రుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబుతో జాగ్ర‌త్త అంటూ మాట్లాడారు. అంతేకాదు బీజేపీతో పొత్తుకు రాం రాం ..త‌లాక్ చెప్పే ఆస‌న్న‌మైందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మ‌రి ఇంత‌మంది పార్టీ నేత‌లుండ‌గా ఆయ‌నే ఎందుకిలా మాట్లాడుతున్నారంటే ఈ ఎంపీ విమ‌ర్శ‌ల వెనుక పెద్ద స్టోరీయే ఉన్న‌ట్లు తెలుస్తోంది...?

ముంద‌స్తు ఎన్నిక‌లొస్తున్నాయి జాగ్ర‌త్త ప‌డాలి. లేదంటే త‌న కొడుకు భ‌విష్య‌త్తు తెగిన గాలిపటంలా త‌యార‌వుతుంద‌ని టీజీ వెంక‌టేష్ భావించారు. ఎన్నిక‌ల్లో త‌న కొడుకు భ‌ర‌త్ ను నిల‌బెట్టాల‌ని స్కెచ్ వేస్తున్నారు. అందుకు తగ్గ‌ట్లుగానే వచ్చే ఎన్నికల్లో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి పోటీగా చంద్ర‌బాబును ఒప్పించి పార్టీ తరుపున తన కొడుక్కి టిక్కెట్ ఇప్పించేలా టీజీ వెంకటేష్ తెగ ఉబ‌లాట‌ప‌డుతున్న‌ట్లు టాక్ .

తన‌కున్న ప‌లుకుబ‌డితో కొడుక్కి టికెట్ ఇప్పించినా క‌ర్నూలులో గెల‌వ‌డం క‌ష్టమే. ఎందుకంటే ప‌లు స‌ర్వేలా ఆధారంగా క‌ర్నూలు నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ - బీజేపీ బ‌లంగా ఉంది. పొత్తు కంటిన్యూ చేస్తే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని భావించిన టీజీ వెంక‌టేష్ బీజేపీని దూరం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలంటూ అట్నుంచి న‌రుక్కొస్తున్నాంటూ పొలిటిక‌ల్ పండితులు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విష‌యానికొస్తే పార్టీలో సీనియ‌ర్ నేత - ఎడారిలో నీటి చుక్క కోసం ప‌క్షి ఎదురు చూసిన‌ట్లు మంత్రి మండ‌లిలో సీటు కోసం ఎదురు చూస్తున్నలీడ‌ర్. గ‌త ఎన్నిక‌ల్లో ఆశించి భంగ‌బ‌ప‌డ్డారు. కానీ ఇదంతా గ‌తం . ఇప్ప‌డు త‌న అడ్డా అయిన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కోసమే బీజేపీతో పొత్తుకు స‌సేమిరా అంటున్నార‌ని పొలిటిక‌ల్ టాక్ న‌డుస్తోంది.

రాజ‌మండ్రి అర్బ‌న్ బుచ్చ‌య్య‌కు మాంచి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం . త‌న మాటే శాస‌నం . కానీ పొత్తులో భాగంగా బుచ్చయ్య‌ను రాజ‌మండ్రి అర్బ‌న్ నుంచి రూర‌ల్ కి మార్చారు. అర్బ‌న్ ను బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కు కేటాయించారు. ఇదే విష‌యంపై బుచ్చ‌య్య బీజేపీ నేత‌ల‌పై ఘ‌ర్ష‌ణ కు దిగిన దాఖ‌లాలున్నాయి. కాబ‌ట్టే బీజేపీ తో పొత్తు బ‌చ్చ‌య్య చౌద‌రి ఒప్పుకోవ‌డంలేద‌ని , మ‌ళ్లీ పొత్తు అంటే త‌న హాట్ సీట్ ద‌క్క‌ద‌నే ఉద్దేశంతోనే క‌మ‌లంపై గుర్రుగా ఉన్నార‌ని గుస‌గులు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కంటే సొంత ప్ర‌యోజ‌న‌ల‌కోస‌మే బీజీపీ టార్గెట్ చేయ‌డంపై స్థానిక నేత‌లు సెటైర్లు వేసుకుంటున్నారు.