Begin typing your search above and press return to search.
సోము వీర్రాజుకు అసలైన సవాల్ !
By: Tupaki Desk | 25 March 2018 12:31 PM GMTటీడీపీతో బీజేపీ బంధం తెగడానికి రెండేళ్ల నుంచే పునాదులు వేసుకుంటూ వస్తున్న రాజకీయ నేతగా ఈ మధ్య సోము వీర్రాజుపై సెటైర్లు పేలుతున్నాయి. ఇంతవరకు ఏ బీజేపీ నేత కూడా ఆలోచించడానికి కూడా వెనుకాడని దారుణమైన ఆరోపణలు నిన్న సోము వీర్రాజు చంద్రబాబుపై చేశారు. దీంతో వీర్రాజుపై చంద్రబాబు రియాక్ట్ కాకపోయినా అదే సమయంలో వచ్చిన అమిత్ షా లేఖ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీని అమిత్‌షాను కడిగి పారేశారు. సుమారు 12 వేల కోట్ల రూపాయల నిధులు రకరకాల విద్యా సంస్థలకు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా... నాలుగేళ్లలో కేవలం నాలుగు శాతం నిధులిచ్చి రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా అన్నీ ఇచ్చామంటూ అబద్ధాలు కూస్తారా అంటూ చంద్రబాబు అమిత్ షాను తీవ్రంగా దునుమాడారు. చంద్రబాబు బీజేపీని ఆ స్థాయిలో కడిగేయడం ఈ టెర్ములో తొలిసారి అని చెప్పొచ్చు.
అయితే, నిన్న సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై చాలా మంది టీడీపీ నేతలు స్పందించారు. వాటన్నింటినీ విమర్శల్లా కొట్టి పారేసే ఛాన్సు సోము వీర్రాజుకు ఉంది గాని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విసిరిన సవాలుకు మాత్రం సోము వీర్రాజు స్పందించక తప్పని సరి పరిస్థితి నెలకొనేలా ఉంది. ఆదివారం మీడియాను పిలిచి మరీ బీజేపీపై విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరి సోము వీర్రాజుకు ఒక సవాల్ విసిరారు.
సోముకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని పేర్కొన్నారు. వార్డు మెంబరుగా గెలవలేని వ్యక్తి చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటని బుచ్చయ్య స్పందించారు. తనపై సోము గెలిస్తే అతను చెప్పివన్నీ ఒప్పుకుంటానని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అన్యాయం - మోసమే పొత్తు తెంచుకోవడానికి కారణమని... ప్రజలు నాడి తెలుసుకోకుండా బీజేపీ నేతలు పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారని బుచ్చయ్య వ్యాఖ్యానించారు.
సోము గోదావరి ప్రాంతం కావడంతో... బుచ్చయ్య సవాలుకు ఏదో ఒకసమాధానం చెప్పక తప్పదు. ఎక్కడో రాయలసీమలో పోటీ చేయమని సవాలు వస్తే దాన్ని ఇగ్నోర్ చేసినా పెద్ద నష్టం ఉండదు గాని తమ ప్రాంతం నుంచి ఈ సవాలు వచ్చేటప్పటికి సోము నేరుగా స్పందించే అవకాశం ఉండకపోవచ్చు. పైగా బుచ్చయ్య 40 ఏళ్లుగా ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. ఆయనతో పోటీ పడటం అంటే సోమువీర్రాజుకు నేల విడిచి సాము చేయడమే అవుతుంది.
ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి కూడా బుచ్చయ్య చౌదరి స్పందించారు. కర్ణాటకలో తెలుగు వాళ్లు అందరూ కలిసి బీజేపీని నేలకేసి కొడతారని అన్నారు. అక్కడ తెలుగు వారి దెబ్బకు బీజేపీ రెడీగా ఉండాలని ఆయన సూచించారు.