Begin typing your search above and press return to search.
బాబుకు కొరుకుడు పడని బుచ్చయ్యచౌదరి
By: Tupaki Desk | 4 April 2017 9:53 AM GMTసాధారణంగా సీనియార్టీ పెద్దరికాన్ని తెచ్చి పెడుతుంది. కానీ.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యవహారం మాత్రం అందుకు భిన్నం. దూకుడుగా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. నేటి తరం లీడర్ల మాదిరి.. ఊరికే ఆవేశపడిపోవటం.. ప్రత్యర్థులపై ఒంటికాలి మీద లేవటం.. ఆవేశంతో ఊగిపోవటం లాంటివి కనిపిస్తుంటాయి. ఏపీ అసెంబ్లీలో అప్పుడప్పుడు ఆవేశంతో ఆయన ఊగిపోయే తీరు చూసినప్పుడు భయం వేస్తుంది. అంత పెద్ద మనిషి అంతలా ఊగిపోతున్నారే అన్న కంగారు వచ్చేస్తుంది కూడా.
అయితే..అంతగా ఊగిపోయినా.. వెనువెంటనే కంట్రోల్ కావటం బుచ్చయ్య స్పెషాలిటీ. జగన్ అండ్ కో మీద విరుచుకుపడటమే మంత్రి పదవికి షార్ట్ కట్ గా ఫీలయ్యారేమో కానీ.. ఆయనీ మధ్య దూకుడు పెంచారు. కానీ.. ఆయన ఆశల్ని నీరుకారుస్తూ చంద్రబాబు ఆయనకు మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించలేదు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ.. తనలాంటి సీనియర్‌కు పక్కాగా మంత్రిపదవి అనుకున్న వేళ.. అలాంటిదేమీ లేకపోవటంతో తెగ ఫీలైన బుచ్చయ్య చౌదరి.. ఈసారి తన ఆగ్రహాన్ని పార్టీ అధినేతపై ప్రదర్శించారు.
బుచ్చయ్య చౌదరి మాదిరి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాలేవని ఫస్ట్రేట్ అయిపోయి.. బాబును విమర్శలతో ఉతికి ఆరేశారు. అయితే.. తన టీంతో అలాంటి వారి నోటికి తాళాలు వేసేసినా.. బుచ్చయ్య చౌదరి మాత్రం ఎంతకూ వెనక్కి తగ్గటం లేదు. పార్టీ పరపతిని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసే వారిపై వేటు వేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చినా.. ఆయన డోన్ట్ కేర్ అన్నట్లుగా పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలోని నేతల్ని చూస్తే.. తాము ఏ పార్టీలో ఉన్నామా? అన్న డౌట్ వస్తుందంటూ ఎటకారం చేసేశారు.
అంతేనా.. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేస్తుంటే టీడీపీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. బుచ్చయ్య చౌదరి మాత్రం వెళ్లలేదు. అంతేకాదు.. తనకు సెక్యూరిటీ ఉన్నగన్ మెన్లను సైతం ఆయన తిప్పి పంపించటం గమనార్హం. అందరిని కంట్రోల్ చేస్తున్న చంద్రబాబు.. బుచ్చయ్యను మాత్రం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/