Begin typing your search above and press return to search.

బుట్టా దెబ్బ‌కు బాబు విల‌విల‌..!

By:  Tupaki Desk   |   1 April 2018 5:26 AM GMT
బుట్టా దెబ్బ‌కు బాబు విల‌విల‌..!
X
కొంద‌రు త‌మ‌కు ద‌క్కిన అవ‌కాశాన్ని అందుకొని ఒకొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతుంటారు. మ‌రికొంద‌రు మాత్రం ఇందుకు భిన్నంగా. దొరికిన ఛాన్స్ తో ఎక్క‌డికో వెళ్లాల‌న్న ప్లాన్ వేస్తూ తామెంత స్వార్థంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్న విష‌యాన్ని త‌మ చేత‌ల‌తో చెప్పేస్తుంటారు.

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక వ్య‌వ‌హారం ఇంచుమించు ఇదేలా ఉంది. పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ పెద్ద‌గా లేకున్నా.. న‌మ్మి సీటు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి థోకా ఇవ్వ‌టాన్ని జ‌గ‌న్ పార్టీ నేత‌లు.. అభిమానులు ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే ర‌కంగా బుట్టాను ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు.

ప‌వ‌ర్ త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా బుట్టా తీరు ఉంటుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు త‌గ్గ‌ట్లే విప‌క్ష ఎంపీగా వ్య‌వ‌హ‌రించ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని ఆమె.. ఏపీ అధికార‌ప‌క్షంలోకి జంప్ అయ్యారు. అయితే.. ఎక్క‌డ అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌న్న ముంద‌స్తు ఆలోచ‌న‌తో.. తాను మాత్రం అధికార‌పార్టీలోకి జంప్ కాకుండా.. త‌న అనుచ‌ర గ‌ణాన్ని టీడీపీలో చేర్చేశారు. టీడీపీలో చేరుతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ.. మెడ‌లో మాత్రం ప‌చ్చ కండువా వేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బాబుకు సైతం బుట్టా త‌న‌దైన శైలిలో హ్యాండిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం.. ఆపై స‌భ‌లో ఆందోళ‌న‌లు చేస్తున్న వైనం తెలిసిందే. ఇంత హ‌డావుడిలో ఏపీ తెలుగు త‌మ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌డితే.. బుట్టా మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌టం లేదు.

అంతేకాదు.. మోడీ స‌ర్కారుపై బాబు అదే ప‌నిగా విమ‌ర్శ‌ల మీద విమ‌ర్శ‌లు చేస్తున్న వేళ‌.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా ఒక్క‌సారి గ‌ళం విప్ప‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని క‌లిసి వ‌చ్చార‌న్న స‌మాచారం లీక్ అయ్యింది.

త‌న‌ను ఎంపీగా చేసిన జ‌గ‌న్ కు షాకిచ్చిన బుట్టా రేణుక‌.. ఇప్పుడు బాబుకు సైతం ప‌క్కా హ్యాండ్ ఇచ్చిన‌ట్లేన‌ని చెబుతున్నారు. అంతేకాదు.. మోడీతో భేటీలో 2019 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానానికి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించిన‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని బుట్టా ముందు ఉంచిన‌ప్పుడు.. ఆమె త‌న స‌మాధానాన్ని చాలా ఆస‌క్తిక‌రంగా చెప్పారు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న నిర్ణయం ఉంటుంద‌ని చెప్పారు. మొద‌టిసారి ఎంపీగా ఎన్నికైన బుట్టాలో గ‌డుసుద‌నం చాలా ఎక్కువేన‌ని.. న‌మ్ముకున్న వారికి హ్యాండ్ ఇవ్వ‌టంలో అదిరిపోయే రికార్డును ఇప్ప‌టికే సొంతం చేసుకున్న ఆమె.. రానున్న రోజుల్లో దాన్ని మ‌రింత మెరుగు ప‌ర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.