Begin typing your search above and press return to search.
బాబుకు బుట్టా షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం!
By: Tupaki Desk | 16 March 2019 4:49 AM GMTమాట ఇచ్చే విషయంలో ఎంత సింఫుల్ గా ఇచ్చేస్తారో.. అంతే ఈజీగా దాన్ని తప్పటంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించినోళ్లు ఉండరన్న మాటను చెబుతుంటారు. పార్టీలోకి ఆహ్వానించే సమయంలో ఇచ్చే హామీలకు.. తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు పోలికే ఉండదన్న విమర్శ పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. బాబును నమ్ముకోవటం అంటే హెల్మెట్ లేని బైక్ రైడింగ్ గా చెబుతుంటారు.
పార్టీలోకి వచ్చేందుకు కోరినన్ని హామీలకు ఓకే అనేయటం.. పార్టీలోకి రప్పించటమే లక్ష్యం తప్పించి.. వారికిచ్చే హామీలను ఎలా నెరవేర్చాలన్న ఆలోచన బాబులో తక్కువని చెబుతుంటారు. ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనమే తప్పించి మరింకేమీ ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకగా చెబుతుంటారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీలోకి తీసుకురావటం కోసం బాబు కిందా మీదా పడ్డారు. చివరకు ఆమె పార్టీలో చేరిన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కర్నూలు టికెట్ ఇస్తానన్న హామీ ఇచ్చి తీసుకొచ్చారు. ఈ రోజున కోట్ల పార్టీలోకి రావటంతో ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇవ్వటం.. గతంలో తాను మాట ఇచ్చిన బుట్టా రేణుక విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు.
ఇంతకాలం పార్టీలో ఉన్న తనను కాదని.. ఇప్పుడు కోట్లను తీసుకొచ్చి తనను బాబు మోసం చేసినట్లుగా ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. బాబుకు గుణపాఠం చెప్పేందుకు ఆమె తిరిగి జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. సామాజికంగా బలమైన వర్గం కావటం.. బుట్టా రేణుకకు ప్రజల్లో ఆదరణ బాగా ఉండటంతో ఆమెను వదులుకోవటానికి బాబు సుతారం ఇష్టపడటం లేదు. అలా అని ఆమె కోరినట్లుగా కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.
దీంతో.. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బాబు రెఢీ అయినా.. బుట్టా మాత్రం నో చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా పంపుతానన్న హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తాను పోటీ చేస్తే గెలుపు పక్కా అయిన వేళ.. నామినేటెడ్ ఎంపీగా ఎందుకు ఉండాలన్న క్వశ్చన్ బుట్టా వేస్తున్నట్లు చెబుతున్నారు. పోటీకి దూరంగా ఉండటం ద్వారా తన ఇమేజ్ ను తాను తగ్గించుకున్నట్లు అవుతుందన్న వాదనను ఆమె సన్నిహితులు తెర పైకి తెస్తున్నారు. బాబు తమకు చేసిన మోసానికి ప్రతిగా పార్టీ నుంచి బయటకు వచ్చేసి.. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుట్టా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. కోట్ల ఎంట్రీతో బాబుకు జరిగిన మేలు సంతేగమో కానీ.. బుట్టా ఎగ్జిట్ తో మాత్రం భారీ డ్యామేజ్ తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది.