Begin typing your search above and press return to search.
‘హెలికాప్టర్ కొనివ్వండి’.. రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ..! ఎందుకో తెలిస్తే షాకే
By: Tupaki Desk | 12 Feb 2021 1:30 PM GMTహెలికాప్టర్ కొనిపెట్టండి సారూ.. అంటూ ఓ మహిళా రైతు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసింది. ఇప్పుడీ లేఖ సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇంతకు ఆ మహిళకు హెలికాప్టర్ ఎందుకు అవసరం పడింది. ఆమె నేరుగా రాష్ట్రపతికే ఎందుకు లేఖ రాసిందో? ఈ కథనంలో తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం మాండ్‌సౌర్ జిల్లాలొరి బర్ఖేడా గ్రామంలో బసంతి బాయి అనే మహిళరైతు నివసిస్తున్నారు. ఆమెకు గ్రామంలో కొంత భూమి ఉంది. అయితే ఆ పొలానికి వెళ్లేందుకు బాట (మార్గం) లేదు. పొలానికి వెళ్లాలంటే కచ్చితంగా వేరే పొలాలను దాటుకుంటూ వెళ్లాల్సిందే. అయితే ఇతర పొలాల వాళ్లు ఆమెను రానివ్వడం లేదు.
ఈ సమస్యను పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు బసంతి బాయి. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె నేరుగా రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఇలా ఉంది. ‘అయ్యా మాది బర్ఖేడా గ్రామం. నాకు ఈ గ్రామంలో పొలం ఉంది. కానీ పొలానికి వెళ్లడానికి మార్గం లేదు. ఇతరులకు చెందిన పొలాలను దాటుకుంటూ వెళ్లాలి. నన్ను పొలాల గుండా రానివ్వడం లేదు. మీరు దయతలిచి హెలికాప్టర్ ఇప్పిస్తే నేను హెలికాప్టర్లో నా పొలానికి వెళ్తా’ అంటూ ఆమె లేఖ రాసింది. ఈ లేఖ సోషల్మీడియాలో తెగవైరల్ అవుతోంది.
బసంతి బాయి తన సమస్య అధికారులకు చెప్పేందుకు స్థానికంగా ఉండే ఓ టైపిస్ట్ సాయంతో ఈ లేఖ రాయించింది. ఈ లేఖ ప్రస్తుతం విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ సైతం స్పందించారు.
ఈ విషయంపై యశ్పాల్ మాట్లాడుతూ.. ‘సదరు మహిళా రైతుకు నేను హెలికాప్టర్ అయితే ఇప్పించలేను. కానీ కచ్చితంగా ఆమె సమస్యను పరిష్కరిస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు.