Begin typing your search above and press return to search.

ఇకపై బిట్ కాయిన్లతో టెస్లా కారు కొనొచ్చు..!

By:  Tupaki Desk   |   25 March 2021 11:30 PM GMT
ఇకపై బిట్ కాయిన్లతో టెస్లా కారు కొనొచ్చు..!
X
బిట్ కాయిన్లు ఉపయోగించి టెస్లా కారు కొనొచ్చని ఆ కార్ల సంస్థ సీఈవో ఎలెన్ మస్క్ ప్రకటించారు. బిట్ కాయిన్లతో అమెరికాలో టెస్లా కారు కొనుగోలు చేయవచ్చని.. ఈ ఏడాది చివరి నుంచి అమెరికా వెలుపల విక్రయాలు జరుగుతాయని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే బిట్ కాయిన్లు కొనుగోలు చేస్తుందని ట్వీట్ చేశారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

కంప్యూటర్ నోడ్ వాటిని నివారిస్తాయి..

బిట్ కాయిన్ల పేమెంట్ ఆమోదించడానికి ఇంటర్నెల్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ను టెస్లా ఉపయోగిస్తుందని.. ఇది నేరుగా బిట్ కాయిన్ నోడ్ లను నిర్వహిస్తుందని ఎలెన్ మస్క్ వివరించారు. కంప్యూటర్ లోని నోడ్ లు బిట్ కాయిన్ లావాదేవాలను పరిశీలిస్తాయని తద్వారా క్రిప్టో కరెన్సీని రెండు సార్లు ఉపయోగించకుండా నివారించగలమని ఆయన ట్విట్టర్ లో స్పష్టం చేశారు. ఈ బిట్ కాయిన్లను అలాగే ఉంచుతామని.. మామూలు కరెన్సీలోకి మార్చలేమని తెలిపారు.

కొనుగోళ్లు పెరుగుతాయా?

బిట్ కాయిన్లతో టెస్లా కార్ల కొనుగోలు ప్రక్రియ ఆ సంస్థ వెబ్ సైట్ లో సవివరంగా ఉంది. అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన టెస్లా కార్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బిట్ కాయిన్లతో టెస్లా కారు కొనొచ్చని ఆ సంస్థ సీఈవో ప్రకటించడం వల్ల కొనుగోళ్లు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల బిట్ కాయిన్ల విలువ గణనీయంగా పెరుగుతోంది. క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఎలెన్ మస్క్ ఇప్పటికే పలు సార్లు ట్వీట్ చేయడం గమనార్హం.