Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదా : రాఘవులు కొత్త డిమాండ్
By: Tupaki Desk | 21 Sep 2015 6:57 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై చూపించే ఆసక్తి ప్రత్యేకహోదా సాధించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించడం లేదని సీపీఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీలు వంటి అంశాలను రాజకీయంగా పరిష్కారం చేయాలి తప్ప.. ఎవరికి నచ్చిట్లు వారు చేయాలంటే సాధ్యం కాదన్నారు. అందుకే ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలని.... అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీకి చెందిన పలు అంశాలపై రాఘవులు మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేకహోదా సాధించేందుకు రాజకీయమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు అందులోకి వస్తాయన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటన విషయంలో అరవింద్ పనగారియాకు - నీతి ఆయోగ్ కు సంబంధం లేదని రాఘవులు స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ లాంటిదని.. వారికి తోచింది వారు చెబుతారని అన్నారు. ఆ సలహాలను కేంద్రం పాటించవచ్చు., పాటించకపోవచ్చునని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ కు ఉన్న హక్కులు, శక్తి.. నీతి ఆయోగ్‌కు లేవని. నీతి ఆయోగ్ కేవలం ఆలోచన చేసే బృందం మాత్రమేనని స్పష్టం చేశారు. నీతి అయోగ్ ఆలోచనలు ప్రభుత్వంపై ప్రభావం చూపే పరిస్థితి లేదని అన్నారు. పనగారియా సలహా అడిగి బీహార్ కు ప్రత్యేకోహోదా ప్రకటన చేయలేదని రాఘువులు స్పష్టంచేశారు. బీహార్ కు లక్షా 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేకప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.... ప్రత్యేకోహోదా కోసం 18 నెలలుగా పోరాటం చేస్తున్న ఏపీకి ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.
'ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, స్పెషల్ స్టేటస్ డెవలప్ మెంట్ సపోర్టు' అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 26 న కేంద్రపభుత్వానికి ఒక మెమోరండాన్ని సమర్పించారు. ఈ మెమోరండంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయం కావాలి. ఏఏ అంశాల ప్రాతిపదికన సాయం అవసరమవుతుందనే అంశాలను ఆయన దీని మీద కేంద్రప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుంది. ఇంతకు ఆ మెమోరాండంలో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలన్నీ ఉన్నాయా అనే దానిపై క్లారిటీ రావాలని అన్నారు.
బీహార్ లో ఎన్నికల కోసం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేశారని, ఇది రాజకీయ నిర్ణయమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఒక రాజకీయ నిర్ణయం ఎందుకు చేయించలేకపోతున్నారని తెలుగుదేశం ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఏపీకి ప్రత్యేకోహోదా ఇవ్వండి.. ఆ లోగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండి అని సీఎం చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని రాఘవులు సూటిగా ప్రశ్నించారు. బీహార్ కు ఏ ప్రాతిపదిక మీద కేంద్రం లక్షా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని ప్రశ్నిస్తూ...ఏపీకి ఆ విధంగా ఎందుకు ఇవ్వదని అన్నారు.