Begin typing your search above and press return to search.
ఆత్మకూరు బరిలో 14 మంది.. మెజారిటీపై వైసీపీ తర్జన భర్జన
By: Tupaki Desk | 21 Jun 2022 4:36 AM GMTనెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక అధికార పార్టీ వైసీపీలో గుబు లు రేపుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. ఇక్కడ మండలాల వారీగా పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించింది.
అయితే.. ఆశించిన విధంగా జనాల నుంచి స్పందన లేదు. పోనీ.. సెంటిమెంటు వర్కవుట్ అవుతుందని.. అనుకున్నా.. బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. నిజానికి వీరిలో కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
మరికొందరు.. ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి కూడా నాయకులను తీసుకువచ్చి ఇక్కడ బీజేపీ ప్రచారం పెంచనుంది. ఇక, ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. వైసీపీ అధిష్టానం.. తమ మూడేళ్ల పాలనకు ఈ ఉప ఎన్నికలను గీటురాయిగా చూపించాలని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పాలని పక్కా వ్యూహం సిద్ధం చేసుకుంది.
ఈ క్రమంలోనే స్వతంత్రంగా పోటీ చేస్తున్న నలుగురిని పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నాలు సాగా యి. అదేసమయంలో చిన్న చితక పార్టీల అభ్యర్థులను కూడా పోటీ నుంచి తప్పుకొనేలా చేయాలని భా వించారు. అయితే.. ఎందుకో ఇది సాధ్యం కాలేదు.
నామినేషన్ల ఉపసంహరణ నాటికి కూడా తమ ప్రయ త్నాలు సక్సెస్‌కాలేదు. దీంతో పోటీ భారీ ఎత్తున జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. దీనివల్ల వైసీపీకి వస్తున్న ప్రధాన అవరోధం.. మెజారిటీపై నే పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు కనీసం లక్ష మెజారిటీ వస్తుందని ఆశించిన వైసీపీ నాయకులు ఇప్పుడు 50 వేల మెజారిటీ వస్తే చాలనే పరిస్థితి వచ్చింది. ఇటీవల మంత్రి రోజా ఇక్కడ పర్యటించి.. ప్రచారం చేసేందుకు రెడీ అయినా.. జనాలు రాకపోవడం.. మంత్రులు చేస్తున్న ప్రచారానికి కూడా అనుకున్న విధంగా జోష్ లేకపోవడం.. వైసీపీని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ తగ్గితే.. ప్రభుత్వంపై సానుకూలత లేదనే ప్రచారం జరుగుతుందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని.. మంత్రులు ప్రచారం చేయాలని తాజాగా.. అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలిసింది. మరి ఏం చేస్తారో చూడాలి.