Begin typing your search above and press return to search.
వామ్మో... తెలంగాణ లో మళ్ళీ ఉప ఎన్నికలా ?
By: Tupaki Desk | 11 Nov 2021 2:30 PM GMTహుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వేడి ఇంకా చల్లారకుండానే మళ్ళీ అసెంబ్లీ ఉపఎన్నికలనే ప్రచారం పెరిగిపోతోంది. తొందరలోనే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు గ్యారెంటీ అనే ప్రచారం రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ అసెంబ్లీలకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అలాగే వేములవాడ నుండి చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్నారు. కోమటిరెడ్డి దాదాపు ఏడాదికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతున్నా కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని భవిష్యత్తంతా బీజేపీదే అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు తొందరలోనే రాజీనామా చేసి కమలం పార్టీలో చేరబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ప్రకటించటమే కాకుండా కాంగ్రెస్ నేతలకు దూరంగా కమలనాథులకు చాలా దగ్గరగా కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారు. దాంతో ఏదోరోజు ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజీనామా చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న బీజేపీ నేతలు కోటమిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఎంఎల్ఏగా రాజీనామా చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. కమలనాదుల వ్యూహం వర్కవుటైతే కోమటిరెడ్డి తొందరలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేయటం ఖాయమనే అనిపిస్తోంది.
ఒకవేళ మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైతే బీజేపీ తరపున పోటీ చేయబోయే కోమటిరెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదే సమయంలో వేములవాడలో నిజానికి ఎప్పుడో ఉపఎన్నిక రావాల్సింది. రమేష్ కు జర్మనీ పౌరసత్వ వివాదం కోర్టులో నడుస్తోంది. రమేష్ జర్మనీ పౌరుడే అని ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చింది. అయితే ఏదో సాంకేతిక కారణాలను పట్టుకుని రమేష్ తన కేసును కోర్టులో ఇంకా లాగుతున్నారు.
ఎంత లాగినా ఏదోరోజు రమేష్ పై అనర్హత వేటుపడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కాబట్టి తొందరలోనే వేములవాడ స్ధానానికి ఉపఎన్నిక తప్పేలా లేదు. కాబట్టి ఇక్కడ కూడా తమపార్టీ తరపున ఎవరైనా బలమైన నేతను పోటీలోకి దింపాలని కమలనాదులు డిసైడ్ అయ్యారు. గట్టి నేతల కోసం తమపార్టీతో పాటు ఇతర పార్టీల్లో కూడా చూస్తున్నారు. ఇతర పార్టీల్లో ఎవరైనా గట్టి నేతలు తగిలితే వెంటనే వాళ్ళతో మాట్లాడి బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కమలనాథులు అనుకుంటున్నది అనుకున్నట్లు జరిగితే తొందరలోనే మరో ఇద్దరు ఎంఎల్ఏలు ఆ పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.