Begin typing your search above and press return to search.
ఉప ఎన్నికలు: హుజూరాబాద్, బద్వేలులో ఒఖేసారి?
By: Tupaki Desk | 1 Sep 2021 9:31 AM GMTతెలంగాణలో ఇప్పుడు హూజూరాబాద్ పేరు మారుమోగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మరోసారి గెలవాలని ఈటల.. ఆయనను ఓడించాలని కేసీఆర్ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునేందకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నోటిఫికేషన్ ఇంకా రాకముందే నియోజకవర్గంలో పొలిటికల్ వెదర్ రోజు రోజుకు హీటెక్కుతోంది. టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతుండగా.. ఇదే తరుణంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో హూజారాబాద్లో సెప్టెంబర్లో ఎన్నికలు ఉండొచ్చని కొన్ని రోజుల కిందట ప్రచారం సాగింది. కానీ ఎవరూ ఆ విషయాన్ని నిర్దారించలేదు. తాజాగా ఈనెలలోనే ఉప ఎన్నిక కచ్చితంగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకు ఓ బలమైన కారణం ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయబడ్డాడు. దీంతో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకుండానే టీఆర్ఎస్ బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. పాదయాత్రతో ఈటల రాజేందర్ గ్రామ గ్రామాన తిరుగుతున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వ సైతం ఈటల రాజేందర్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ కు పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ పర్యటిస్తారని అంటున్నారు.
ఇక అధికార పార్టీ హుజూరాబాద్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పథకాల ఫలాలను ఇక్కడి ప్రజలకు పొల్లుపోకుండా అందిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడే ప్రారంభించి ఫైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.2వేల కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నిక కోసం ఇంతలా ఖర్చు పెట్టాలా..? అని విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నియోజకవర్గంలోని దళితులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలకర్ లు ఇక్కడే మకాం వేసి ఇంటింటికి తిరుగుతున్నారు.
టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించగా.. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు దాదపు ఖరారైనట్లే. ఇక ఉప ఎన్నిక ఎంత ఆలస్యంగా జరిగితే తమకు అంత మంచిదని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలతో నియోజకవర్గ ప్రజలందరినీ ఆకర్షించి భారీ మెజారిటీతో గెలవాలని చూస్తోంది. ఇందులో భాగంగా దళిత బంధు సర్వేను నిర్వహించి వాటి ఫలాలను అందరికీ అందేలా చూస్తున్నారు. ఇప్పటికే 15 మందికి యూనిట్లను అందజేసిన అధికారులు మిగతా అర్హులకు ఇచ్చేలా ప్రణాళిక వేస్తున్నారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికకు, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధ ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలోని కడపజిల్లాలోని బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మార్చి 28న చనిపోయారు. రాజ్యాంగం ప్రకారం నియోజవర్గంలో అభ్యర్థి రాజీనామా చేసినా.. చనిపోయినా.. అక్కడ ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించారు. బద్వేల్ లో సెప్టెంబర్ 28 నాటికి వెంకటసుబ్బయ్య మరణించి ఆరునెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈనెల 28 నాటికి ఇక్కడ తప్పనిసరిగా ఉప ఎన్నిక నిర్వహించాలి. అయితే బద్వేల్ తో పాటు హుజూరాబాద్ ఎన్నిక కూడా ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. అంటే ఈనెల చివరిలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంటే అవకాశం ఉంది.