Begin typing your search above and press return to search.
బైరెడ్డి బైక్ ఎక్కారు.. అరెస్ట్ అయ్యారు
By: Tupaki Desk | 5 Sep 2016 11:04 AM GMTరాయలసీమ హక్కుల గురించి తరచూ గళం విప్పే కర్నూలు జిల్లా రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయ్యారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధినేతగా ఆయన కొంతకాలంగా సీమ హక్కుల గురించి పోరాడుతున్న సంగతి తెలిసిందే. క్రమపద్ధతితో కూడిన కార్యాచరణ ఏమీ లేకుండా ఎప్పుడు ఏం తోస్తే అది చేస్తారన్న పేరున్న బైరెడ్డి తాజాగా కర్నూలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి కారణం ఏమిటంటారా? బైరెడ్డి లాంటోళ్లు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయటానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. వినాయక చవితి సందర్భంగా ఆయనీ ర్యాలీ నిర్వహించారు.
తన అనుచర గణాన్ని.. బైకుల్ని సిద్ధం చేసిన బైరెడ్డి.. తాను సైతం స్వయంగా ఒక బైకు మీద ఎక్కి.. ర్యాలీ పేరిట కర్నూలు నగరంలో హడావుడి చేశారు. మరింత చేస్తున్నఆయన.. ర్యాలీకి అధికారికంగా అనుమతులు తీసుకున్నారా? అంటే లేదనే చెప్పాలి. అందుకే.. ర్యాలీచేస్తున్న బైరెడ్డిని ప్రశ్నించిన పోలీసులు.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్నందుకు అరెస్ట్ అయ్యారు.
సీనియర్ రాజకీయ నాయకుడిగా.. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న బైరెడ్డి లాంటి వారికి.. ర్యాలీలు నిర్వహించాలంటూ పోలీసుల వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయాన్ని కూడా గుర్తు చేయాల్సి ఉంటుందా? బైరెడ్డి లాంటోళ్లను నమ్ముకున్న పాపానికి ఆయన అనుచర వర్గం మీద కూడా పోలీసులు కేసులు పెట్టి స్టేషన్ కు తరలించారు. ర్యాలీ కారణంగా వచ్చే మైలేజీ సంగతేమో కానీ.. బైరెడ్డి అండ్ కో ఖాతాలో మాత్రం మరో కేసు నమోదైందని చెప్పక తప్పదు.