Begin typing your search above and press return to search.
కమలం గూటికి బైరెడ్డి..గత్యంతరం లేకేనా?
By: Tupaki Desk | 29 Nov 2019 5:34 AM GMTఏపీలో రాజకీయ వలసలు ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీ లో ఎందుకు చేరుతున్నారో కూడా అంచనా వేయడం కష్టంగా మారుతోంది. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో రాజకీయ నేతలు పార్టీలు మారుతుంటారు. కానీ , ఎన్నికలు ముగిసి పట్టుమని ఆరు నెలలు కూడా కాక మునుపే ..ఏపీ నేతలు వలసలకు తెరతీశారు. అధికార దాహం కోసం కొంతమంది .. రాజకీయ భవిష్యత్ కోసం కొంతమంది ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ వలసలు ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ని మరింతగా కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.
ఇప్పటికే కొంతమంది ఎంపీలు సైకిల్ దిగి ..బీజేపీ లోకి చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే లు - పార్టీలోని కీలక నేతలు కొంతమంది వైసీపీలోకి - బీజేపీలోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన కర్నూల్ జిల్లా కీలక సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - తన కూతరు తో సహా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీఎస్)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలు పెట్టి కొద్దీ రోజుల్లోనే దానికి స్వస్తి పలికారు. ఇకపోతే ఇప్పట్లో ఏపీలో బీజేపీ అంత బలంగా లేకున్నా కూడా రాజకీయ భవిష్యత్ కోసం బైరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగువెలిగిన అనంతరం పార్టీతో విబేధించి ఆర్ పీఎస్ ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత దాన్ని రద్దు చేసారు. ఎన్నికల సమయంలో బైరెడ్డి మళ్లీ టీడీపీలో చేరబోతున్నారు అనే వార్తలు వినపడ్డా కూడా ...అయన అనూహ్యంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత డీసీసీ పదవి విషయంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో బైరెడ్డికి విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ లో చేరిన కొద్దిరోజులకే బైరెడ్డి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చారు.
ఇకపోతే 2014 ఎన్నికలకు ముందు వివిధ కేసుల నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలు కు వెళ్లగా ఆయన కుమార్తె రంగ ప్రవేశం చేసి.. తండ్రి తరఫున పోరాటం ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో ఆమె స్వయంగా ఇండిపెండెంట్ గా బరిలో నిలిచినప్పటికీ - ప్రజా మద్దతు సాధించలేక ఓడిపోయింది. ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేకపోవడం తో గత్యంతరం లేక ..రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరారు. ఈయన గురువారం రాత్రి బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.