Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి మ‌రో సీనియర్ నేత‌!

By:  Tupaki Desk   |   21 July 2018 1:47 PM GMT
కాంగ్రెస్ లోకి మ‌రో సీనియర్ నేత‌!
X

2019లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఇప్ప‌టివ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న పార్టీలు....చేరిక‌లపై దృష్టి సారించాయి. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివ‌రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి....కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ స‌మ‌క్షంలో...మాజీ సీఎం కిర‌ణ్...కాంగ్రెస్ లో చేరారు. కిర‌ణ్ తో పాటు మ‌రికొంద‌రు కీల‌క‌మైన నేత‌లు కూడా కాంగ్రెస్ లో చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా - కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేడు రాహుల్ గాంధీ సంక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వగలిగిన ఏకైకా పార్టీ కాంగ్రెస్ అని, అందుకే ఆ పార్టీలో చేరానని బైరెడ్డి అన్నారు. అంతేకాకుండా, త్వరలో కర్నూలులో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి...దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించామని చెప్పారు.

ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ సాధ‌నే ల‌క్ష్యంగా `రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ‌ స‌మితి`ని 2013లో బైరెడ్డి రాజ శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించారు. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన బైరెడ్డి....తాజాగా మ‌ళ్లీ టీడీపీలో చేరబోతున్నార‌ని ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో త‌మ … ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా చంద్ర‌బాబు సూచ‌న ప్ర‌కారం ఉప‌సంహ‌రించుకున్నారు. అయితే, ఆ తర్వాత టీడీపీ నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో బైరెడ్డి ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉన్నారు. టీడీపీలోని ఓ వర్గం బైరెడ్డికి వ్య‌తిరేకంగా ఉండ‌డంతోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు నుంచి పిలుపు రాలేద‌ని తెలుస్తోంది. బైరెడ్డి అన్న కుమారుడు కూడా కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. ఈ నేప‌థ్యంలో బైరెడ్డిని కోట్ల కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బైరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం...అవ‌కాశాన్ని బ‌ట్టి పీసీసీ చీఫ్ గా నియమిస్తామని.. కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.