Begin typing your search above and press return to search.

ఏపీలో మరో రచ్చ రెడీ అవుతోందా?

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:57 AM GMT
ఏపీలో మరో రచ్చ రెడీ అవుతోందా?
X
కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టి ప్రభుత్వాన్ని వారం రోజుల పాటు నిద్రలేకుండా చేసిన ముద్రగడ పోరాటం ముగిసింది... అయితే... అది ఇలా ముగిసిందో లేదో, అక్కడికి వారం రోజుల్లోనే రాష్ట్రంలో మరో పోరాటానికి నాంది పడుతున్నట్లుగా ఉంది. రాయలసీమ చైతన్య యాత్ర పేరుతో మాజీ మంత్రి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి 14వ తేదీ నుంచి పోరాటానికి దిగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. మొన్న జరిగిన తప్పులు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కాగా చైతన్య యాత్ర నేపథ్యంలో బైరెడ్డి అన్ని వర్గాలను కలుస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అయరావతి జపం తప్ప వేరే ఆలోచన లేదని బైరెడ్డి ఆరోపిస్తున్నారు. అభివృద్ధి అంతా అమరావతికి మళ్లిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు వైఖరి వల్ల రాయలసీమలసీమ వాదానికి బలం మండిపడుతున్నారు. త్వరలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన అంటున్నారు.

కర్నూలుకు చెందాల్సిన రాజధానిని గుంటురుకు తరలించడమేగాక రాయలసీమను నిర్లక్ష్యం చేయడమేమిటని చంద్రబాబును ప్రశ్నిస్తున్న బైరెడ్డి రాయలసీమలో నెలకొన్న కరవు - వలసలు - నిరుద్యోగం గురించి సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంచినీరు కోసం ప్రజలు పరుగులుతీస్తుంటే, చంద్రబాబు జపాన్ - సింగపూర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని ఆరోపించారు. ఫుట్ పాత్ పై దుప్పట్లు, స్వెట్టర్లు అమ్మే వారికి నల్లకోటు వేసి వారంతా జపాన్ నుంచి వచ్చారని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలోని ఎర్రచందనం, బెరైటీస్ అమ్మగా వచ్చిన డబ్బు ఏం చేశారో? రాయలసీమకు ఎంత కేటాయించారో? చెప్పాలని బైరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా రాయలసీమలో 14 నుంచి ప్రారంభించే ఈ యాత్రను 3 నెలలపాటు జరపాలని బైరెడ్డి అనుకుంటున్నారు.