Begin typing your search above and press return to search.
బైరెడ్డి చేరేది టీడీపీలో కాదట
By: Tupaki Desk | 10 Sep 2017 4:00 PM GMTతెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగి రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్ పీఎస్)పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టి....ఐదేళ్ల పాటు నడిపిన తర్వాత ఆ వేదికను నడిపిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన పోరాటానికి మంగళం పాడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌పీఎస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత బైరెడ్డి చూపు అధికార తెలుగుదేశం పార్టీపై పడినట్లు ప్రచారం సాగింది. అయితే ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం లేదని, ప్రతిపక్షమైన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
దివంగత ఎన్ టిఆర్ పిలుపుతో 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బైరెడ్డి పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసిన సమయంలో రాయలసీమ పూర్తిగా అన్యాయానికి గురవుతుందనే ఆందోళనతో 2013లో ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందనే భావనతో బైరెడ్డి తన చాపచుట్టేశారు. నంద్యాల ఉప ఎన్నికలో తనను బరిలో నిలిపిన అభ్యర్థిని కేవలం 154 ఓట్లు సాధించడంతో తన పోరాటం ఆపేస్తున్నట్లు బైరెడ్డి ప్రకటించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామ శివారులోని కృష్ణానది ఒడ్డున బైరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు కార్యకర్తలతో సమావేశమయిన సమయంలో ఈ ప్రకటన చేశారు. రాయలసీమ ఉద్యమాన్ని ప్రజలు ఆదరించనందువల్లే - ప్రత్యామ్నాయం కోసం రాయలసీమ ఉద్యమ కాడిని కింది దించేశానన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి కాడిని ఎత్తుకోవచ్చని బైరెడ్డి కోరారు.
అయితే ఇంతకీ బైరెడ్డి రూటు ఎటు అనే అంశంపై కొత్త చర్చ మొదలైంది. తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం బైరెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారట. ఇంకా ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే...ఆయన్ను కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని రద్దు చేసి మరో పార్టీలో చేరాలని ఆలోచిస్తున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తాను సైతం కాంగ్రెస్‌లో చేరాలని డిసైడైన కిరణ్ కుమార్ రెడ్డి ఈ క్రమంలో బైరెడ్డిని సైతం కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నారట. బైరెడ్డికి సంబంధించి ఇంకా చర్చల ప్రక్రియ ప్రారంభం కాలేదని, అయితే ఆయన అంగీకరిస్తే పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఇద్దరికి పార్టీ సభ్యత్వం అందిస్తామంటున్నారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చే తేదీలను బట్టి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తేదీ - వేదిక నిర్ణయం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.