Begin typing your search above and press return to search.

జగన్ తెలంగాణాలో ప్రవేశిస్తే ప్రకంపనలే....హాట్ వార్నింగ్ ఎవరికి...?

By:  Tupaki Desk   |   19 Jan 2023 3:30 AM GMT
జగన్ తెలంగాణాలో ప్రవేశిస్తే ప్రకంపనలే....హాట్ వార్నింగ్ ఎవరికి...?
X
ఏపీలో బీయారెస్ ప్రవేశించినట్లే. కేసీయార్ దూకుడు చేస్తున్నారు. కమిటీలను వేస్తున్నారు. ఏపీ నడిబొడ్డున బిగ్ సౌండ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు అధికార పార్టీ నుంచే నేతలను తన వైపునకు తిప్పుకుంటాను అంటున్నారు. తనకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి ఫోన్లు వస్తున్నాయని కేసీయారే చెబుతున్నారు.

అంటే ఏపీలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లే లెక్క. మరి దాని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతోంది అని చూస్తే ఆ పార్టీకి చెందిన యువ నేత శాప్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి అయితే ఏపీలో బీయారెస్ కి ఏమి పని అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేశారు. బీయారెస్ ఏపీలో ఏమి చేస్తుంది అని ఆయన నిలదీస్తున్నారు.

ఏపీలో బీయారెస్ చేయాల్సిందేంటో ఏమి చేస్తుందో తాము చూస్తామని అంటున్నారు. అదే టైం లో తెలంగాణాలో జగన్ కి ఫ్యాన్స్ వీర లెవెల్ లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వారంతా జగన్ కోసం ఎంతైనా అన్నట్లుగా ఉంటారని బైరెడ్డి చెప్పారు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలోనూ జగన్ కి వీరాభిమానులు ఉన్నారని ఆయన కొత్త విషయం చెప్పారు.

ఏపీలో బీయారెస్ వస్తుంది చించేస్తుంది పొడిచేస్తుంది అని తెలంగాణా మంత్రులు ఒక్కటే ఊదరగొడుతున్నారు, నిజానికి ఏపీకి వచ్చి బీయారెస్ ఏమి చేస్తుంది అన్నది తెలియదు కానీ జగన్ కనుక తలచుకుంటే ఒక్కసారి తెలనగాణాలో అడుగు పెడితే కనుక అక్కడ ప్రకంపనలే వస్తాయని బైరెడ్డి అంటున్నారు.

అంతే కాదు అక్కడ ప్రభుత్వాలే తల్లకిందులు అవుతాయని అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి తెలంగాణాలో జగన్ నిజంగా వేలు పెడతారా ఆయన అక్కడకు స్టెప్ వేస్తే అది పొలిటికల్ గా అంతటి ప్రభావం చూపుతుందా అన్న చర్చ అయితే బైరెడ్డి మాటల తరువాత లేవదీశారు అని చెప్పాల్సి ఉంటుంది.

నిజానికి తెలంగాణాలో వైఎస్సార్ అభిమానులు నిండుగా దండిగా ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన కార్యక్షేత్రాన్ని ఏపీకే పరిమితం చేసుకున్నారు. తమ నాయకుడు ఏపీని తప్పించి ఎక్కడకీ వెళ్లరని పదే పదే సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పుకొస్తున్నారు. జగన్ కూడా నాకు ఏపీ ముఖ్యం. ఇక్కడే ఉంటాను ఇక్కడే రాజకీయాలు చేస్తాను అని తన సొంత గడ్డ కడప గడప నుంచే సంచలన ప్రకటన చేశారు.

అలాంటిది జగన్ తెలంగాణా ఎందుకు వెళ్తారు అక్కడ ఏ విధంగా అడుగు పెడతారు అన్నది రాజకీయ పార్టీలలో ఉన్న వారి అందరికీ కలుగుతున్న డౌట్. అయితే రాజకీయాలలో ఒక మాట అంటే అలాగే ఉండాలని లేదు. బీయారెస్ ఏపీలో దూకుడు చేస్తూంటే తాము కూడా మీ కంట్లో పొడుస్తామని చెప్పడానికి వైసీపీ నేతలు ఈ మాటలు వాడుతున్నారు అనుకోవడానికీలేదు, రేపటి రోజున పాలిటిక్స్ ఏ మాత్రం మారినా తెలంగాణాలో నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా వైసీపీ వేలు పెడుతుందేమో అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. మరి ఇదంతా ఎవరి కోసం, ఎవరికి ఈ హెచ్చరికలు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.