Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న బైరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకుంటున్నారు..

By:  Tupaki Desk   |   19 Jan 2023 4:25 AM GMT
రెచ్చిపోతున్న బైరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకుంటున్నారు..
X
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ఉద్దేశించి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఆ పార్టీకి చెందిన వారు వెంటనే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనను టార్గెట్ చేశారు. అటు బీఆర్ఎస్ పై కూడా ఆసక్తికరంగా మాట్లాడారు. తాజాగా ఆ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మంలో సభ నిర్వహించిన బీఆర్ఎస్ పై స్పందిస్తూనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నోరుపారేసుకున్నారు. పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్ చేస్తూ రెచ్చిపోయారు. దీంతో జనసైనికులు రీ కౌంటర్ వేయడానికి సిద్ధమవుతున్నారు.

పవన్ కల్యాణ్ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపారు. ప్రజా నాయకుడిగా సాగుతున్న వారెవరైనా వారి తరుపున పోరాడాల్సిందే. వారికి జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపాల్సిందే. ఈ నేపథ్యంలోనే జనం కోసమే తమ పార్టీ అని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాన్ అధికార పార్టీని విమర్శించారు. అయితే ఎక్కడా పరుష జాలాన్ని వాడలేదు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉందని అన్నారు.

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పందించారు. సాదా సీదాగా కాకుండా ఏకంగా ప్రకంపనలు సృష్టిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. జగన్ కు ప్రైవేట్ సైన్యం ఉందని, జగన్ విషయంలో ఎవరైనా వేలు పెడితే ఊరుకోమంటూ బెదిరించినట్లు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు గుర్తున్నాయా..? అని విమర్శించారు. అంతేకాకుండా రంగం సినిమాలో విలన్ లా పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్నాడని అన్నారు. పైకి మంచి వాడిలా నటిస్తూ లోపల ఆ సినిమాలోని విలన్ లాగానే క్యారెక్టర్ అని అన్నారు.

దేశంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు అని, అలాంటి నాయకుడితో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? అని అన్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన ఆయన పరుష వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపింది. పవన్ పై ఇప్పటి వరకు చాలా మంది వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. కానీ ఎవరూ ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వలేదని జనసైనికులు అంటున్నారు. అయితే జగన్ కు ఎన్ని ప్రైవేట్ సైన్యాలు ఉన్నా.. పవన్ కల్యాణ్ వెంట జనసేన్యం ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరుపోస్టులు పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.