Begin typing your search above and press return to search.
కర్నూలులో సిద్ధారెడ్డి సంగతేంటి.. వైసీపీలో చర్చ!
By: Tupaki Desk | 21 April 2022 4:30 PM GMTకర్నూలు రాజకీయాల్లో దూకుడుగా ఉన్న యువ నాయకుడు.. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్, రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ చైర్మన్.. బైరెడ్డి సిద్దార్థరెడ్డి వ్యవహారం.. వైసీపీకి తలనొప్పిగా పరిణ మించిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన శాప్ చైర్మన్గా ఉన్నప్పటికీ. ఏదో ఒక ననియోజకవర్గం నుంచి తనకు వచ్చే ఎన్నిక్లలో టికెట్ కావాలని కోరుతున్నారు. అయితే..దీనికి సంబంధించి అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు.
దీంతో ఆయన నొచ్చుకున్నారని.. త్వరలోనే తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారని కధనా లు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయనటీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా .. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని.. వైసీపీ అనుకూల మీడియాల్లోనే కథనాలు వచ్చాయి. అయితే... దీనిని తూచ్ అంటూ.. బైరెడ్డి ఖండించారు. తాను పార్టీ మారేది లేదని..జగన్‌కు వీర విధేయుడినని ప్రకటించుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ,, ఆయన చేస్తున్న పనులు, వేస్తున్న అడుగులు మాత్రం ఇంకా అనేక సందేహాలకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయన వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో యువజన వ్యవహారాల శాఖను రోజాకు కేటాయించారు. శాప్ కూడా ఆమె మంత్రి త్వ శాఖ పరిధిలోకే వస్తుంది. శాప్ వ్యవహారాలపై తిరుపతిలో సమీక్షను రోజా నిర్వహించారు. ఈ సమీక్ష లో అంతా తానై వ్యవహరించాల్సిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాలేదు.
బైరెడ్డి ఎందుకు రాలేదన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే జరుగుతున్న పరిణామాలపై అవగాహ న ఉందేమో కానీ రోజా ఈ విషయాన్ని పట్టించుకోకుండానే సమీక్ష ముగించి వెళ్లారు. ఇక, ఈ కార్యక్రమానికి బైరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే డుమ్మా కొట్టారనేది వైసీపీ నేతల అంతర్గత చర్చలో తేలుతున్న అంశం. నం దికొట్కూరులో.. ఎమ్మెల్యే ఆర్థర్‌కు.. బైరెడ్డికి.. ఎక్కడా పడడం లేదు. అధికారులను... నాయకులను బైరెడ్డి తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని.. ఆర్ధర్ వర్గం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.
ఈ పంచాయతీ.. అధిష్టానం వరకు కూడా చేరింది. ఈ క్రమంలో.. అధిష్టానం బైరెడ్డికి క్లాస్ ఇచ్చిందనే వాదన అందరికీ తెలిసిందే. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం వేటలో ఉన్నారు. ఈ పరిణామాలకు అధిష్టానం తనకు సహకరించడం లేదనేది బైరెడ్డి వర్గం ఆవేదన. ఈ నేపథ్యంలలోనే ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. మరి ఈ అసంతృప్తి మంటలు చల్లారుతాయో.. లేదో.. చూడాలి.