Begin typing your search above and press return to search.

`గ‌డ‌ప.. గ‌డ‌ప‌కు`కు వెళ్లొద్దు.. బైరెడ్డికి వైసీపీ అధిష్టానం షాక్‌

By:  Tupaki Desk   |   6 Jun 2022 3:03 AM GMT
`గ‌డ‌ప.. గ‌డ‌ప‌కు`కు వెళ్లొద్దు.. బైరెడ్డికి వైసీపీ అధిష్టానం షాక్‌
X
యువ నాయ‌కుడు, ఏపీ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న విమ‌ర్శ‌ల‌కు, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న విష‌యం తెలిసిందే. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన సిద్ధార్థ‌రెడ్డి గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీతీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టికే క‌ర్నూలు జిల్లా లో టికెట్ల కేటాయింపు అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ఎస్సీ రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు కు ఇంచార్జ్‌గా నియ‌మిం చిన వైసీపీ అధిష్టానం.. కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

దీంతో యువ నాయ‌కుడిగా అంద‌రినీ ఆక‌ర్షించిన బైరెడ్డి..ఇ క్క‌డ నుంచి రెండో సారి వైసీపీ టికెట్‌పై పోటీ చేసిన ఆర్థ‌ర్‌కు సాయం చేశారు. ఆయన మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. రెడ్డి వ‌ర్గం ఓట్ల‌ను వైసీపీకి ప‌డేలా ప్లాన్ చేశారు. అదేస‌మ‌యంలో యువ‌త‌తోనూ.. సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఆర్థ‌ర్ గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు , బైరెడ్డికి మ‌ధ్య ఆధిప‌త్య హోరు పెరిగిపోయింది. దీంతో ఇరువురు నాయ‌కుల మ‌ధ్య చీటికీ మాటికీ వివాదాలు తెర‌మీదికి వ‌చ్చా యి. అంతేకాదు.. ప‌లుమార్లు అధిష్టానం ఇరువురికి కూడా స‌ర్ది చెప్పింది.

అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని.. బైరెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు అధిష్టానం వ‌ద్ద ప‌లుకుబ‌డి ఉంద‌ని.. పేర్కొంటూ.. సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీంతో వారంతా బైరెడ్డికి వ్య‌తిరేకంగా మారిపోయా ర‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో బైరెడ్డిపై ఫిర్యాదులు పెరిగిపోయాయి. క‌ర్నూలు జిల్లాలో త‌మ‌కు ప్ర‌త్యామ్నాయంగా త‌యార‌వుతున్నాడ‌నే భావ‌న సీనియ‌ర్ల‌లో ఉంది. అదేస‌మ‌యంలో బైరెడ్డి పార్టీ మారుతున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బైరెడ్డి చుట్టూ.. వివాదాలు ముసురుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ను పాల్గొన‌కుండా.. కొంద‌రు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. దీంతో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లొద్ద‌ని వైసీపీ క్రేజీ యూత్ లీడ‌ర్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని పార్టీ పెద్ద‌లు ఆదేశిం చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తి, ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం మాత్రం స్థానికంగా ఉన్న కొంద‌రు చెబుతున్న వాద‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని తెలుస్తోంది. దీంతో బైరెడ్డికి .. ఇప్పుడు ఎటూ పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.