Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్‌గా ఇద్ద‌రు వైసీపీ యంగ్ లీడ‌ర్ల భేటీ...!

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:43 AM GMT
హాట్ టాపిక్‌గా ఇద్ద‌రు వైసీపీ యంగ్ లీడ‌ర్ల భేటీ...!
X
ఎక్క‌డో రాయ‌ల‌సీమ‌లోని క‌ర్నూలు జిల్లా. ఇటు కృష్ణాజిల్లాలోని మ‌చిలీ ప‌ట్నం. ఈ రెండు ప్రాంతాల‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. ఇక్క‌డ తీర ప్రాంతం ఉంది. అక్క‌డ లేదు. అక్క‌డ చారిత్ర‌క క‌ట్టడాలు ఉన్నాయి.. ఇక్క‌డ‌కూడా.. ఉన్నాయి. అలాంటి బిన్న‌మైన ప్రాంతాల‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ కులు తాజాగా భేటీ అయ్యారు. అదికూడా.. పొలాలు.. చెట్ల మ‌ధ్య పెద్ద వేదిక‌ను ఏర్పాటు చేసుకుని భేటీ కావ‌డం.. ఆస‌క్తిగా మారింది. వారే.. క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం ఏపీ శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి. మ‌రొక‌రు.. మాజీ మంత్రి పేర్ని నాని త‌న‌యుడు .. కిట్టు!

వాస్త‌వానికి ఈ ఇద్ద‌రు కూడా.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధులు కారు. అయిన‌ప్ప‌టికీ.. బైరెడ్డి విష‌యాన్ని తీసుకుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. క‌ర్నూలు జిల్లాలోనూ.. త‌న‌కు తిరుగులేద‌నే సంకేతాలు పంపుతున్నారు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునేందుకు వీలుగా.. నియోజ‌క‌వ‌ర్గం అన్వేష‌ణ‌లోనూ ఉన్నారు. ఇక, దీనిపై కొంత క్లారిటీ రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌ పేర్ని నాని కుమారుడుగా ప్ర‌స్తుతం ప్ర‌చారంలో ఉన్న పేర్ని కృష్ణ‌మూర్తి ఉర‌ఫ్ కిట్టు.. కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై క‌న్నేశారు. త‌నతండ్రికి బ‌దులుగా ఆయ‌నే ఇక్క‌డ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం ఉంది.

అయితే..దీనిని సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌న్నార‌ని.. తెలుస్తోంది. వార‌సుల‌కు టికెట్ ఇచ్చేది ఈ ఎన్నిక‌లో కాద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిం దేనని.. స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. పేర్ని కిట్టు మాత్రం.. దూకుడు త‌గ్గించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ దిరుగుతున్నారు.

ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. సెటిల్ మెంట్లు కూడా.. చేస్తున్నార‌ని అంటున్నారు. దీంతో మ‌చిలీప‌ట్నంలో ఎటు చూసినా..కిట్టు పేరే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, తాజాగా బైరెడ్డి-కిట్టు క‌లుసుకోవ‌డం.. సుదీర్ఘంగా మూడు గంట‌ల పాటు.. పొలాల్లో వేదిక ఏర్పాటు చేసుకుని.. చ‌ర్చించ‌డం.. వంటివి రాజ‌కీయంగా ఆస‌క్తిని రేపుతోంది.

మ‌రో రెండు మాసాల్లో సంక్రాంతి రానుంది. ఈ నేప‌థ్యంలో జిల్లాలో కోడిపందేలు.. ఇత‌ర‌త్రా.. ఆట‌ల‌కు ప్ర‌సిద్ది. ఈ నేప‌థ్యంలోనే.. బైరెడ్డి ఇక్క‌డ‌.. వాటి కోసం.. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి త‌న వంతు స‌హ‌కారం అందించేందుకు పేర్ని కిట్టుకూడా.. ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇది కాకుండా.. ఇంకా వేరే విష‌యాలు.. వీరిమ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇదే స‌మ‌యంలో రాజ‌కీయాలు కూడా.. చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. శాప్ ఆధ్వ‌ర్యంలో మచిలీప‌ట్నంలోదూకుడు పెంచాల‌ని.. పేర్ని కిట్టు కోరిన‌ట్టు తెలుస్తోంది. మొత్త‌గా.. ప్ర‌త్యేక డ‌యాస్‌లు ఏర్పాటు చేసి.. మ‌రీ సాగిన ఈ భేటీలో ఏం జ‌రిగింద‌నేది అత్యంత ర‌హ‌స్యంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.