Begin typing your search above and press return to search.
వైసీపీలో ఉన్న ఆ ఇద్దరు నేతలపై బైరెడ్డి సిద్థార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 7 Nov 2022 2:30 PM GMTఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. వైసీపీలో ఉన్న ఇద్దరు నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు నేతలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. వైఎస్ జగన్ కాకుండా వైసీపీలో తాను అభిమానించే ఇద్దరు నేతలు వీరిద్దరనేనని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
బందరు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో తాను ఉన్నానో, లేనో అని అనుకునే పరిస్థితుల్లో తన బాధల గురించి ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసేలా చేసింది.. అనిల్ కుమార్ యాదవేనని తెలిపారు. ఆయన తన కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. అనిల్ అన్న చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోనన్నారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి తన సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చేశారని కృతజ్ఞతలు తెలియజేశారు. అందువల్ల అనిల్ అన్న చేసిన సాయాన్ని జీవితాంతం ఎప్పటికీ గుర్తించుకుంటానని వెల్లడించారు.
అలాగే మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టూ అన్నా తనకు ఇష్టమని చెప్పారు. కిట్టూ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారని అభినందించారు. కోవిడ్ సమయంలో సైతం ప్రజలకు సేవలు చేశారన్నారు. గొప్ప నాయకుడిగా ఎదగాలంటే ప్రజలతోనే ఉండాలన్నారు. ప్రజల్లో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్న కిట్టూ అంటే తనకు మంచి అభిమానం ఉందని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు.
ఏమీ సాధించని వాళ్లు, ఏమీ చేతికాని వాళ్లు కూడా ప్రపంచాన్ని జయించామని చెప్పుకుంటూ తిరుగుతుంటారని.. కానీ కిట్టు మాత్రం ఆ టైపు వ్యక్తి కాదన్నారు.
జగన్ ఇచ్చిన బీ ఫామ్‌తో ముక్కు మొహం తెలియనివాళ్లు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారని గుర్తు చేశారు. ఇక ఎంతో మంది సామాన్యులను సర్పంచ్‌లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లగా చేసిన ఘనత జగన్‌దేనని బైరెడ్డి తెలిపారు.
తనకు ఈ గుర్తింపు వచ్చిందంటే అది జగనన్న వల్లేనని స్పష్టం చేశారు. ఆదరించే ప్రజలు, జగనన్న ఉన్నంతవరకు తనకేమీ కాదని తెలిపారు. గతంలో తనపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సిద్థార్థ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలిసిన జగన్ ఈ విషయంపై ఆరా తీశారన్నారు. ఆ ప్రయత్నాలను అడ్డుకుని తనకు అండగా నిలబడ్డారని కొనియాడారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.