Begin typing your search above and press return to search.
బీజేపీ చీలిక వెనుక బాబు
By: Tupaki Desk | 21 Jan 2018 10:25 AM GMTసార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు స్థాయికి చేరిపోయినప్పటికీ ఆ పార్టీ తరఫున గళం వినిపించే నేతల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య ఒకరు. అవకాశం దొరికితే చాలు బాబును ఇరకాటంలో పడేసే రామచంద్రయ్య...సుదీర్ఘకాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. తమ మిత్రపక్షం అయినప్పటికీ బీజేపీని చంద్రబాబు చీల్చారని..ఆయన వల్లే బీజేపీ నేతలు రెండు వర్గాలుగా మారిపోయారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం చేయనప్పటికీ.... ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం - రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడం - ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వంటి పనులు మాత్రం చేశారని రామచంద్రయ్య అన్నారు. స్వంత ప్రయోజనాలను చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రామచంద్రయ్య ఆరోపించారు.ఓటుకు నోటు కేసులో ఇరుక్కొన్నందునే బాబు కేంద్రానికి భయపడుతున్నాడని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బాబు తగిన చర్యలు తీసుకోవడం లేదని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.
తన వ్యక్తిగత అవసరాల కోసం ఏపీ బీజేపీలో చీలికకు సీఎం చంద్రబాబు కారణం అయ్యారని రామచంద్రయ్య ఆరోపించారు. తనకు అనుకూలంగా ఉన్న వర్గంతో బాబు పనులు చేయించుకుంటున్నారని...మరో వర్గం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తోందని పేర్కొంటూ...బాబు నిర్ణయం కారణంగా మిత్రపక్షంలో కూడా విబేధాలు వచ్చాయన్నారు.